By: ABP Desam | Updated at : 14 Sep 2021 08:05 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
రైతు కోసం తెలగు దేశం ఆందోళనలు (ప్రతీకాత్మక చిత్రం)
రైతుల సమస్యలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రైతు కోసం తెలుగుదేశం పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలను 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్ పరిధిలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. 5 పార్లమెంట్ స్థానాల పరిధిలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గోనున్నారు. ఇవాళ రాయలసీమ పరిధిలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆందోళన చేపట్టనున్నారు.
ఐదు జోన్లలలో
రేపు(15వ తేదీ) కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో, 16న ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిరసనలు చేపట్టనున్నారు. 17వ తేదీన అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో, 18న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనునన్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది.
Also Read: TDP Fight : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?
తహసీల్దార్లకు వినతి పత్రాలు
టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జ్యోతుల నెహ్రూ, బి.సి.జనార్దన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులుకు జోన్ల బాధ్యతలు అప్పగించారు. నిరసనన అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే చేపట్టినట్లు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ వైఖరితో ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ ఆరోపిస్తుంది.
Also Read: EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే
నారా లోకేశ్ పాల్గొనే అవకాశం
వర్షాలు బాగా కురిసినా సాగునీరు అందకపోవడం, పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించకపోవడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, విత్తనాలు, ఎరువులపై రాయితీలు నిలిచిపోవడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంది. బీమా, పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇలాంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. రైతులకు రుణమాఫీ రద్దు, రైతురథం ద్వారా ట్రాక్టర్లు అందించే పథకాన్ని నిలిపివేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 17న ఉత్తరాంధ్రలో జరిగే నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొనే అవకాశం ఉంది.
Also Read: Dalitha Bandhu News: మూడు వారాల్లోనే దళిత బంధు నిధులు.. ముగిసిన సీఎం రివ్యూ, హాజరైన భట్టి విక్రమార్క
TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్గా రిజెక్ట్ చేసిన వసుధార