By: ABP Desam | Updated at : 06 Feb 2022 07:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,598 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 2,690 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 9 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,664కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,855 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,19,219 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 69,572 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 06/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 6, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,03,455 పాజిటివ్ కేసు లకు గాను
*22,19,219 మంది డిశ్చార్జ్ కాగా
*14,664 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,572#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/bxylyAbTzI
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,03,455కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,855 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 69,572 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,664కు చేరింది.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,07,474 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,13,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,04,61,148కి పెరిగింది. రికవరీ రేటు 95.91గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు చేరింది. కొత్తగా 865 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,01,979కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 7.42గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 10.20గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 167.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 74.01 కోట్ల కరోనా పరీక్షలను నిర్వహించారు. శనివారం ఒక్కరోజే 14,48,513 కరోనా పరీక్షలు చేశారు.
మహారాష్ట్రలో కొత్తగా 11,394 కరోనా కేసులు నమోదయ్యాయి. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కొత్తగా ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదు.
దిల్లీలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదుకాగా 17 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 2.87గా ఉంది.
Also Read: లతా దీదీ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నా.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu Arrest: IRR కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట- బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 3కు విచారణ వాయిదా
Nara Bramhani : ఇతర రాష్ట్రాలను అభివృద్ది చేయడమే ఎజెండానా - సీఎం జగన్‌పై నారా బ్రాహ్మణి విమర్శలు
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
మహిళా రిజర్వేషన్ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
/body>