అన్వేషించండి

Bike Ambulance: గిరిజనులకు శుభవార్త, అడవుల్లోనూ వెళ్లేలా బైక్ అంబులెన్సులు!

Bike Ambulance: మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనుల కోసం ఏపీ ప్రభుత్వం బైక్ అంబులెన్స్ లను ఏర్పాటు చేయనుంది. కాలిబాట ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేలా అన్ని ఏర్పాట్లతో ఈ బైక్ అంబులెన్సులు ఉండునున్నాయి.

Bike Ambulance: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి అనారోగ్యం వస్తే ఎంత కష్టమో తెలిసిందే. మారుమూల ప్రాంతాలు కావడంతో సరైన వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతుంటారు. గిరిజనులకు సుస్తీ చేస్తే డోలీ కట్టి, మంచాలపై పడుకోబెట్టి కొండల్లో, గుట్టల్లో అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్తుంటారు. తీవ్ర అనారోగ్యం వచ్చినా, పురిటి నొప్పులు తీవ్రం అయినా వారికి అదొక్కటే దారి. అటవీ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని 1,818 ప్రాంతాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వారి దుస్థితిని గమనించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి బాధలను తీర్చేందుకు, వారి అవస్థలను తప్పించేందుకు గిరి రక్షక్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గిరి రక్షక్ ప్రాజెక్టు కింద బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 104, 108 అంబులెన్సులతో పాటు మూడు చక్రాల  122 ఫీడర్ అంబులెన్సులతో సేవలు అందిస్తోంది. అయితే ఈ మూడు చక్రాల వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లేలా, కేవలం కాలి బాట ఉన్న ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు అందించేలా ఈ బైక్ అంబులెన్స్ లను తీర్చిదిద్దారు. 

బైక్ అంబులెన్స్ లకు కాలిబాట ఉంటే చాలు..

నాలుగు చక్రాల అంబులెన్స్ లు వెళ్లాలంటే 6 ఫీట్ల గల రోడ్డు, కనీసం మట్టి రోడ్డు అయినా ఉండాల్సిందే. మూడు చక్రాలు గల ఫీడర్ అంబులెన్సులు వెళ్లాలన్నా కనీసం 3 ఫీట్ల రోడ్డు కావాల్సి వస్తుంది. అయితే చాలా గిరిజన ప్రాంతాలకు కేవలం అడుగు లేదా అడుగున్నర మార్గం ఉండే కాలిబాట మాత్రమే ఉంటుంది. గిరిపుత్రులకు ఎవరికైనా సుస్తీ చేస్తే డోలీ లేదా మంచంపై పడుకోబెట్టి అదే దారి గుండా వెళ్లాల్సిన దుస్థితి. బైక్ అంబులెన్సులు అడుగు, అడుగున్నర మార్గంలో కూడా వెళ్తాయి. మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడతాయి. 

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ రూపొందించిన బైక్ అంబులెన్స్ మోడల్ తరహాలో కొత్త బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బైక్ అంబులెన్స్ లో రెండు సీట్లు ఉంటాయి. డ్రైవింగ్ సీటు వెనక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా ఈ సీటు ఉంటుంది. 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా అరకిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. అలాగే సెలైన్ బాటిన్ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రి ఉండేలా ఈ బైక్ అంబులెన్స్ ను డిజైన్ చేశారు.  

ఒక్కో బైక్ అంబులెన్స్ కు 15 గిరిజన ప్రాంతాలు

ఈ బైక్ అంబులెన్స్ లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్ ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి బైక్ అంబులెన్స్ కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి.. అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై శ్రద్ధ వహిస్తారు. గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూములకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్ వెయిటింగ్ రూములకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77 కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget