అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఒకే ఒక్క చూపు..వారిని కలిపింది
ప్రేమకు ఏదీ అడ్డు కాదని నిరూపించింది ఈ జంట. కులం, మతం, ప్రాంతం చూడనిదే ప్రేమంటే అని తెలిసేలా చేసింది.
ప్రేమకు కులం, మతం, ధనిక పేదరికం వంటి తేడాలు ఉండవు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారుతుంది. అటుతరువాత ఇద్దరి అభిరుచులు ఒక్కటైతే చాలు ప్రేమగా మార్చుకుని పెళ్ళి పీటలు ఎక్కుతుంది. కులలు, మతాలే కాదు ఖండాతరాలు దాటి ప్రేమించేస్తున్నారు నేటి యువతరం. ఇద్దరి మనసులు కలిస్తే చాలు ప్రేమలోకంలో విహరించేస్తారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి మధ్య ప్రేమ వికసిచింది. ఐదేళ్లుగా వేర్వేరు కంపెనీల్లో వారిద్దరూ ఉద్యోగులు కొనసాగారు. కానీ ఒకే ఒక్క పరిచయం వారిద్దరి మనస్సులు కలిపింది. ఇద్దరు మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో మూడేళ్లు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేరు వేరు కులాలైనా.. దేశాలు వేరైనా.. జీవన విధానంలో ఎన్నో భిన్నాలు ఉన్నా.. ఇరువురి పెద్దలను తమ వివాహానికి ఒప్పించారు. పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వరుడు స్వగ్రామంలో పెళ్లి చేసుకోవాలనే ఆశను సైతం ఆ వధువు తల్లితండ్రులు ఒప్పుకున్నారు.
చిత్తూరు జిల్లా, పులిచర్ల మండలం, మరికుంటవారిపల్లెకు చెందిన చీమలమర్రి నారాయణకు ఇద్దరు కుమారులు. వంటపని చేస్తూ జీవనం సాగించేవారు. చిన్ననాటి నుంచే ఇద్దరు కుమారులు చురుగ్గా చదివే వారు. ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ కావడంతో ఇద్దరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడారు. పెద్ద కుమారుడు భువన రంగయ్య సెంట్రల్ అమెరికా మెక్సికోలో సోఫాస్ సొల్యూషన్స్ లో ఉద్యోగం సంపాదించాడు. ఐదేళ్లుగా అసోసియేటివ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. సౌత్ అమెరికాకి చెందిన అమ్మాయి ఆనమరియాతో పరిచయం ఏర్పడింది. మరియా ఎంప్లే అమోస్ కంపెనీ కమర్షిల్ డైరెక్టర్ గా పని చేస్తోంది.
Also Read: Mohana Bhogaraju: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?
పనామాలో జరిగిన స్నేహితుల పరిచయం మొదటి చూపుల్లోనే ఇద్దరి చూపులు ఒక్కటయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు కలసి ప్రయాణం అయ్యే వారు. మూడేళ్ళుగా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. పెళ్ళికి పెద్దలు అంగీకరించారు. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. భువన రంగయ్య స్వగ్రామంలో వివాహ వేడుకలు ఇవాళ ఉదయం ఘనంగా జరిగాయి. ఇద్దరూ ఒకటయ్యారు.