Mohana Bhogaraju: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

యూత్ ని ఊపేస్తోన్న బుల్లెట్ బండి సాంగ్ ఆలోచన ఎలా వచ్చింది..ఈ సింగర్ గతంలో ఏఏ పాటలు పాడింది.. ఇంతకీ ఎవరీ మోహనా భోగరాజు..సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్

FOLLOW US: 

‘‘ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా’’ అని హస్కీగా కవ్వించింది.

‘‘ఓ బావా మా అక్కను సక్కగ సూస్తావా’’ అని మురిపించింది

‘‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ?’’ అని మహిళ గొప్పతానాన్ని గొంతులో పలికించింది.

‘‘ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి’’ అంటూ పాటకు ప్రాణం పోసింది.

‘‘హైలో హైలెస్సోరే.. హరిదాసులు వచ్చారే’’ అంటూ గొంతులోనే పండుగ వాతావరణం తీసుకొచ్చింది.

‘‘ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది’’ అని జీవిత సత్యాన్ని స్వరాలతో సాక్షాత్కరించింది.

‘‘భాగమతీ అంటూ ఒళ్లు గొగొర్పొడిచేలా గంభీరంగా ఆలపించింది.

ఇంకా రంగస్థంలో జిగేలు రాణి, సోగ్గాడే చిన్ననాయనలో ‘‘డిక్క డిక్క డుం డుం’’.. ఇలా చెప్పుకుంటూ పోతే  ఆ స్వరంలోంచి జాలువారిన ప్రతి పాటా సూపర్ హిట్టే. కానీ, ఇప్పుడీమె గురించే ఎక్కువ సెర్చ్ జరుగుతోంది. ఎందుకంటే అంతా బుల్లెట్ బండి పాట మహిమ. ‘'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...డుగ్గు డుగ్గు డుగ్గు అని’' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగిపోతోంది. ఈ పాటకు అట్రాక్ట్ కాని యువత లేరంటే ఆశ్చర్యపోవాల్సిందే. వేడుకల్లో, ఆటోల్లో, కార్లలో ఎక్కడ చూసినా ఇదే పాటే ఊపేస్తోంది. ఈ పాట ఇప్పుడే కొత్తగా వచ్చిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ పాట వచ్చి చాలారోజులైంది. ఇప్పుడెందుకు వైరల్ అవుతోందంటే అందుకు కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచీ బుల్లెట్టు బండి సాంగ్ దూసుకుపోతోంది.  

ఆ పాటలో తెలంగాణ జీవం ఉంది, యాస ఉంది, సగటు పెళ్ళికూతురు హృదయం ఉంది, తన ఆశల-ఆకాంక్షల పల్లకీ అది అందుకే అంతలా కనెక్టయింది. లక్ష్మణ్‌  కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించగా, తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. ఆమె  ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది. అయితే ఈ పాట పాడింది ఆమేనని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ‘బుల్లెట్ బండి’సాంగ్‌ వైరల్‌ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? గతంలో ఏ పాటలు పాడిందనే చర్చ మొదలైంది.

హైదరాబాద్ అమ్మాయే..

మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతంపై మక్కువ పెరిగింది.  ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేది. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఫెయిలైంది. అయినప్పటికీ ఎక్కడా తగ్గలేదు..ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అలా ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్‌ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాలాజీ విని ఉదయ్‌ కిరణ్‌ హీరోగా నటించిన ‘జైశ్రీరామ్‌’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడింది. 

బాహుబలిలో ‘మనోహరి’ సాంగ్ తో తిరిగిన దశ

తొలి పాట తర్వాత మోహనకు అవకాశాలు పెద్దగా రాలేదు. కోరస్‌గా పాడినప్పటికీ ఆమెకు గుర్తింపు రాలేదు.  అయితే కీరవాణి దగ్గర పనిచేసే ఓ గాయని సహాయంతో తాను రికార్డ్‌ చేసిన పాటల సీడీని కీరవాణికి అందించింది. ఆ పాటలు బాగా నచ్చడంతో తన టీమ్‌ మెంబర్‌గా చేర్చుకున్నాడు. మొదట్లో కోరస్‌ పాడించుకున్న కీరవాణి.. ‘బాహుబలి’లో మనోహరి పాటను ఆమెతో పాడించాడు. అది సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు మోహనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆఫర్స్ క్యూ కట్టేశాయి.

అరవింద సమేతలో ‘రెడ్డమ్మ తల్లి’ పాట నచ్చనివారుంటారా...

‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్‌) పాటలతో పాటు ప్రత్యేక ఆల్బమ్స్‌ చేస్తూ వచ్చింది.  అరవింద సమేత వీర రాఘవలో క్లైమాక్స్ లో వచ్చే  ‘రెడ్డమ్మ తల్లి’పాటకు మోహనపై ప్రశంసల వర్షం కురిసింది.  ఆ పాటకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మోహన భోగరాజు నామినేట్ అయ్యింది. అలాగే వకీల్‌ సాబ్‌లోని ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ పాడింది భోగనే. ఇప్పటికే సైజ్‌ జీరో, అఖిల్‌, సోగ్గాడే చిన్నినాయనా, ఇజం, శతమానం భవతి, జవాన్‌, భాగమతి, సవ్యసాచి, బ్లఫ్‌ మాస్టర్‌, ఎన్టీఆర్‌ బయోపిక్‌, ఓ బేబీ,వెంకీమామ,హిట్ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో మోహన పాటలు పాడింది.

ఇంతకీ బుల్లెట్‌ బండి ఎలా పుట్టిందంటే..

ఊరూ వాడా మారుమోగిపోతోన్న బుల్లెట్ బండి పాట ఎలా పుట్టిందో ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది మోహన. పెళ్లీడుకొచ్చి ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి?  తాను పెళ్లి చేసుకునే యువకుడికి వివరించాలనేది తన కాన్సెప్ట్‌. తన ఆలోచనకు తగినట్లుగా లక్ష్మణ్‌ మంచి లిరిక్స్‌ అందించాడు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట. అందుకే ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం పొందింది.

Also Read: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్ 

Also Watch:

Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!

Also Read: షూటింగ్ మొదలెట్టిన ''బంగార్రాజు'', ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగడం ఫిక్సా..!

 

Published at : 26 Aug 2021 03:33 PM (IST) Tags: Bahubali Mohana Bhogaraju Bullettu Bandi song Who Is Mohana Bhogaraju Bhagamathi Bluf Master Vakeelsab maguva maguva

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!