Andhra Pradesh News: ఏపీలో 53 బార్‌లకు నోటిఫికేషన్- ఎలా అప్లై చేసువాలంటే?
Andhra Pradesh Bar License Notification: ఏపీ లో 53 బార్‌లకు నోటిఫికేషన్ పడింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మంగళవారం నుంచి అధికారులు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సర కాలపరిమితితో రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ల లైసెన్స్ ల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ లైసెన్స్‌లను వేలంపాట ద్వారా మంజూరు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ప్రకటించారు. ఒక ఏడాది కాల పరిమితితో బార్ల లైసెన్స్ లకు 01.12.2024 నుంచి 31.08.2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53 బార్లకు వేలం నిర్వహిస్తున్నామని ఆసక్తి గల ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు.
గతంలో జరిగిన కేటాయింపులో లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు , బిడ్ అమౌంట్ ను చెల్లించడంలో ఎవరైతే విఫలమయ్యారో వారి బార్లను వేలం వేస్తున్నారు. బార్ల కేటాయింపు పూర్తిగా ఈ వేలం, ఆన్ లైన్ లాటరీ పద్దతిలో మాత్రమే జరుగుతుందన్నారు.
బార్‌ల లైసెన్స్‌ల కొరకు అభ్యర్థులు 16-12-2024 వ తేదీ నుంచి వారి పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆన్ లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది . ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 22-12-2024తో ముగుస్తుంది. 50వేల జనాభా వరకు రూ. 5లక్షలు, 50వేలపైన 5లక్షల లోపు జనాభా వరకు రూ. 7.5 లక్షలు, 5లక్షల జనాభాపైన ఉన్న నగరాలకు రూ. 10లక్షలు దరఖాస్తు రుసుం పెట్టారు. దీన్ని తిరిగి ఇవ్వరు.
ఈ డబ్బులను ఈ నెల 23వ తారీఖు లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 24-12-2024న ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ మొత్తంలో పాడుకున్న వ్యక్తికి సదరు బార్ కేటాయిస్తారు. ఇతర వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా ఆయన కోరారు. వెబ్ సైట్ http://apcpe.aptonline.in , మరింత సమాచారం కొరకు 8074396416 నెంబర్ ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
జిల్లాల వారీగా వేలం వేసే బార్ల వివరాలు.
విజయనగరం-02
విశాఖపట్నం-08
తూర్పుగోదావరి -02
కాకినాడ-01
ఏలూరు-01
కృష్ణా -05
ఎన్టీఆర్ -02
గుంటూరు-08
బాపట్ల -03
పల్నాడు-14
ప్రకాశం -02
తిరుపతి -02
వైఎస్‌్ఆర్ -02
సత్యసాయి -01