అన్వేషించండి

Nara Lokesh: డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష ఎప్పడు? జిమ్మిక్కులు ఆపు జగన్ - నారా లోకేశ్

CM Jagan అధికారం చేపట్టిన నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని లోకేశ్ అన్నారు.

Nara Lokesh on DSC Notification: ఎన్నికలకు రెండునెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ముఖ్యమంత్రి జగన్ సరికొత్త జగన్నాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని అన్నారు. అబద్దాలు, మోసం, వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్.. ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయి, మెగా డీఎస్సీ ఇస్తా అన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్న విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. 

గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని.. ఇప్పుడు చివరకు ప్రజాగ్రహానికి గురై ఇంటికెళ్లే ముందు 6 వేల పోస్టులు భర్తీ చేస్తానంటున్నాడని లోకేశ్ అన్నారు. ‘‘2021 - 22 నాటికి ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. 12,386 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఖాళీలు ఉన్నాయి కానీ 8,366 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి బొత్స అసెంబ్లీలో సెలవిచ్చారు. ఇప్పుడు అందులో కూడా 2,366 పోస్టులు కోతపెట్టి 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటున్నారు. 

మూడు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ - పరీక్ష ఇంకెప్పుడు?

ముఖ్యమంత్రి జగన్, విద్యామంత్రి బొత్స మాత్రం పూటకోమాట చెబుతూ చివరకు నిరుద్యోగులను నిండా ముంచేశారు. 2014-19 మధ్యలో రెండు మెగా డీఎస్సీలు ప్రకటించి 16,790 మంది నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఎన్నికల  కోసమే  జగన్ ఇప్పుడు నోటిఫికేషన్‌ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 వారాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న తరుణంలో జగన్ చేస్తున్న హడావిడి వెనుక అంతర్యమేమిటో  తెలుసుకోలేని అమాయకులా విద్యావంతులైన నిరుద్యోగులు? 

ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే  పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు? పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎన్నికలు సమయానికి ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమయ్యే పనేనా? ఎంతకాలం ఈ మోసపు వాగ్దానాలు? ఇలా ఎన్నిరోజులు నిరుద్యోగులను ఇలా వంచనకు గురిచేస్తారు? చిత్తశుద్ధి లేని ఇలాంటి జిమ్మిక్కులు ఆపి జర సర్దుకోండి.. జగన్’’ అని నారా లోకేశ్ స్పందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - ఇద్దరు సైనికుల మృత్యువాత, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Embed widget