3 Years of YSR Congress Party Rule: మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్
తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నేటితో సీఎం జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.
AP CM Jagan 3 Years Rule: వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో మూడేళ్లు పూర్తయింది. రాష్ట్ర చరిత్రలోనే అతి భారీ మెజారిటీ సాధించి సీఎం కుర్చీ సాధించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ (YS Jaganmohan Reddy) ట్వీట్ చేశారు. తనపై ప్రజలు చూపిన ప్రేమ, అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోందని. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశామని అన్నారు. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు.
‘‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ట్వీట్ చేశారు.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022
రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022