(Source: ECI/ABP News/ABP Majha)
AP Assembly: మార్చి 14 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ నోటిఫికేషన్
పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 14 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
అన్నింటికంటే ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలపై కేబినెట్ భేటీలో స్పష్టత ఉండవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయమై ప్రకటన కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కీలకంగా మారనున్నాయి.
మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 28న విచారణ జరగనుంది. విచారణలో కోర్టు తీర్పు కనుక అనుకూలంగా వస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీ 14న
ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు ఆ మంత్రి వర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.