అన్వేషించండి

Amaravati Construction Status 2026: డీజిల్ కొరత, మండే ఎండలతో కార్మికుల వలస - నిర్మాణాలు స్లో - అమరావతి గ్రౌండ్ రియాలిటీ ఇదే !

Fuel Shortage in Amaravati: అమరావతి నిర్మాణ పనులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం అంతా సవ్యంగా సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.

AP Capital Works Ground Reality:  అమరావతి పనులు జోరుగా సాగుతున్నాయి.కానీ గతంలో ఉన్నంత జోరు లేదు. తగ్గింది. దానికి కారణం డీజిల్ కొరత.  అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న పనులకు ప్రస్తుతం ఇంధన కొరత పెద్ద అడ్డంకిగా మారింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం ఒక కీలక దశలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం బయట ప్రపంచానికి అంతా సవ్యంగా సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.  
 
డిజిల్ పెద్ద సమస్య               

రాజధాని ప్రాంతంలో వినియోగిస్తున్న  భారీ యంత్రాలలో దాదాపు  60 శాతం డీజిల్ కొరత కారణంగా షెడ్లకే పరిమితమయ్యాయి . ఎర్త్ మూవర్స్, టిప్పర్లు, క్రేన్లు నడవడానికి అవసరమైన ఇంధనం సకాలంలో అందకపోవడంతో పనుల వేగం గణనీయంగా తగ్గింది. కాంట్రాక్టు సంస్థలకు నేరుగా బంకుల నుంచి బల్క్ గా డీజిల్ కేటాయించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్రం అందుకు అంగీకరించలేదు. వర్షాకాలం రాకముందే కీలకమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

 వడగాల్పులు - కార్మికుల వలసలు 

కేవలం ఇంధన కొరతే కాదు, పెరుగుతున్న ఎండలు కూడా అమరావతి నిర్మాణాన్ని కుదిపేస్తున్నాయి.  45 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు , దానికి తోడు వీస్తున్న వడగాల్పుల వల్ల మధ్యాహ్నం వేళ పనులు చేయడం అసాధ్యంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల సంఖ్యలోని వలస కూలీలు ఈ తీవ్రమైన వేడిని భరించలేక స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు.  కూలీల కొరత కారణంగా ప్రాజెక్టులు డెడ్ లైన్ లోపు పూర్తవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన లేబర్ క్యాంపుల్లో కనీస వసతులు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీరు, సరైన విద్యుత్ సౌకర్యం,   వేడి నుంచి రక్షణ పొందేందుకు తగిన షెడ్లు లేకపోవడంతో కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్  అధికారులు ఇటీవల కొన్ని క్యాంపులను తనిఖీ చేసి, కాంట్రాక్టు సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.  

 ప్రపంచ బ్యాంక్ ఆందోళన?

అమరావతి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్న  ప్రపంచ బ్యాంక్  ప్రతినిధులు కూడా ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కార్మికుల కొరత , మందకొడిగా సాగుతున్న పనులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్ట్ గడువును పెంచడం వల్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని, దీనిని అరికట్టడానికి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని పర్యావరణ సమతుల్యత పాటిస్తూనే నిర్మాణాలను వేగవంతం చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఇంధన సరఫరాను అత్యవసర సేవ గా గుర్తించాలని ప్లాన్ చేస్తోంది. కార్మికులకు మెరుగైన భోజనం, వసతి కల్పించాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్లు విధిస్తోంది. ప్రభుత్వం గ్రౌండ్ లెవల్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది.  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget