అన్వేషించండి

TDP News : లేని రింగ్‌రోడ్‌లో అవినీతి ఏంటి ? - పుస్తకం రిలీజ్ చేసిన టీడీపీ !

ఇన్నర్ రింగ్ రోడ్‌లో అవినీతి అనేదే లేదని అచ్చెన్నాయుడు ఓ పుస్తకం రిలీజ్ చేశారు. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుపై పూర్తి వివరాలు అందులో ఉన్నాయన్నారు.


 
TDP  News :  ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అవినీతి అంటూ ప్రభుత్వం పెట్టిన కేసులో పూర్తి వివరాలతో తెలుగుదేశం పార్టీ ఓ బుక్ విడుదల చేసింది.  స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ సర్కార్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై కోర్టుల్లో మెమోలు దాఖలు చేసిందని..  ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుడు కేసుల తో చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  జగన్ రెడ్డి రాజకీయ కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా టీడీపీ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించిందని అందుకే వాటిపై పూర్తి వివరాలతో  వెబ్ సైట్‌తో పాటు పుస్తకాలు విడుదల చేస్తున్నామన్నారు. 

‘లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది’ పేరుతో పుస్తకం విడుదల 

అచ్చెన్నాయుడు రిలీజ్ చేసిన పుస్తకంలో రాజధాని అమరావతి అభివృద్ధికోసం గతంలో టీడీపీప్రభుత్వం నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారా న్ని పొందుపరిచారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ విడుదలచేసే పుస్తకాలను చదివి, వాస్తవాలు తెలుసుకొని అధికారపార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.    తన   ఆలోచనలు.. పనితీరుతో చంద్రబాబునాయుడు దేశం గర్వించేలా జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అనేక రాష్ట్రాలకు, వ్యవస్థలకు , వ్యక్తులకు రోల్ మోడల్ గా నిలిచిందనడం అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తిని ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందే తప్ప.. ఎక్కడా వీసమెత్తు అవినీతికి దానిలో ఆస్కారం లేదని తాము తొలినుంచీ చెబుతూనే ఉన్నామన్నారు.   ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు.. అమల్లో పైసా అవినీతి జరగలేదు. రాష్ట్రయువత శక్తి యుక్తుల్ని, మేథా సంపత్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడం కోసం ముందుచూపు తో చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి తన కక్షసాధింపులకోసం బలిచేశాడు. 

చంద్రబాబు తప్పు చేశారని ఒక్క ఆధారమూ చూపించలేదు!

టీడీపీ అధినేతను జైలుకు పంపి 30రోజులవుతున్నా... ఈ ముఖ్యమంత్రి,  ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆయన తప్పుచేశాడని రుజువు చేయలేకపోయింది. న్యాయ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం ప్రవేశపెట్టలేకపోయింది. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేని ఈ దద్దమ్మలు చివరకు ఏమీ తేల్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చిన విరాళాలపై పడ్డారvdvejg.   రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని.. ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతిని ప్రశ్ని స్తున్నాడనే ఆయనపై  కక్ష కట్టి జైలుకు పంపారు. పోలవరం నాశనమైన తీరుని.. రాష్ట్ర రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాడనే టీడీపీ అధినేతను జగన్  రెడ్డి అన్యాయంగా జైలుకు పంపాడు. అమరావతి విధ్వంసం సహా, వ్యవస్థల విధ్వంసం పై బాబు గొంతెత్తడాన్ని జీర్ణించుకోలేకనే ఆయన్ని అన్యాయంగా జ్యుడిషియల్ కస్టడీ లో ఉంచారు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలుకాలేదని, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు మాట్లాడుతున్నాడనే ఆయన్ని కటకటాల పాలు  చేశారన్నారు.  సీఐడీ  చంద్రబాబుని ఏ కేసులో అయితే అరెస్ట్ చేసిందో.. ఆ కేసులో ఆయన తప్పు చేశాడని ఇంతవరకు నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. 

రింగ్ రోడ్ లేదు.. బొంగు రోడ్డు లేదు..కానీ చంద్రబాబుపై కేసు 

అసలు లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతిలేని ప్రభుత్వం...బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలి ఇన్నర్ రింగ్ రోడ్ కు, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని జగన్ సర్కారే హైకోర్టుకి చెప్పింది. అలాంటప్పుడు మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే ఎందుకు లోకేశ్ ప్రస్తావన తెస్తున్నారు? లోకేశ్ ను చూసి ఎందుకంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు .  స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఇసుమంతైనా జరగని అవినీతిని కనిపెట్టేందుకు నాలుగేళ్లుగా తలకిందులుగా తపస్సు చేసిన జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం...తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబు తప్పుచేశాడని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టింది. అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎవరైనా ఎలా తప్పుచేస్తారో ఈ మతిలేని ప్రభుత్వం...బుద్ధిలేని ముఖ్యమంత్రే చెప్పాలి. రింగ్ రోడ్ లేదు.. బొంగు రోడ్డు లేదు.. కానీ చంద్రబాబు మాత్రం తప్పుచేశాడు...ఇదీ ఈ దిక్కుమాలిన బ్యాచ్ చేస్తున్న వితండవాదన. ప్రభుత్వం చెబుతున్నఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అసలు భూసేకరణే జరగలేదు. రోడ్డే వేయలేదు. అలాంటప్పుడు చంద్రబాబు, లోకేశ్ లు తప్పు  చేశారని సిగ్గులేకుండా వైసీపీ నేతలు ఎలా మాట్లాడతారు? ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల్ని ఎదుర్కోవడానికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లోకేశ్ హైకోర్టుని ఆశ్రయిస్తే, ఆ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి, లోకేశ్ కు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానానికి చెప్పింది. లోకేశ్ కు సంబంధమే లేకుంటే, పదేపదే వైసీపీ నేతలు, మంత్రులు ఎందుకు ఆయన పేరు చెబుతున్నారు?  లోకేశ్ ను చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు? జగన్ సర్కార్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి, దేశం మెచ్చిన నాయకుడిని, మహానుభావుడిని అన్యాయంగా 30రోజులుగా జైల్లో పెట్టింది. ఇలాంటి చర్యలతో శునకానందం పొందుతు న్న ఈ ముఖ్యమంత్రిని, అతని పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాలని పిలుపునిస్తున్నాం. వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచిరోజులు వస్తాయన్నారు. 
 
చంద్రబాబుకి మద్ధతు గా నిలవాలి

వాస్తవాలు తెలిసినవారు.. సమాజశ్రేయస్సు కాంక్షించేవారు.. నిత్యం  ప్రజలపక్షాన పోరాడేవారు.. మేథావులు.. విద్యావేత్తలు.. పౌరహక్కుల నేతలు చంద్రబాబునాయుడి ని జైలు పాలు చేయడంపై స్పందించాలి. ప్రొఫెసర్ హరగోపాల్.. సామాజికవేత్త బాలగోపాల్ ల మాదిరే.. ఇతర ప్రముఖులు పెదవి విప్పాలి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ధర్మపోరాటానికి అలాంటి వారి మద్ధతు చాలా  అవసరమని అచ్చెన్నాయుడు  విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Realme V60 Pro: రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
రూ.18 వేలలోనే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్ - రియల్‌మీ వీ60ప్రో వచ్చేసింది!
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Embed widget