News
News
X

Vidadala Rajini : రక్తంతో పెయింటింగ్ వేసిన ఫ్యాన్ - మంత్రి రజనీ రియాక్షన్ ఏమిటో తెలుసా ?

రక్తంతో మంత్రి రజనీ చిత్రాన్ని గీశాడో అభిమాని. దాన్ని నేరుగా ఆమెకే ఇచ్చారు. ఆ చిత్రాన్ని చూసి ఆమె అబ్బురపడ్డారు.

FOLLOW US: 

Vidadala Rajini :   ఫ్యాన్స్ ఉంటే ఆ కిక్కు ఉన్న వాళ్లకే తెలుస్తుంది. ఎందుకంటే వారు చూపించే అభిమానం ఊహించని విధంగా ఉంటుంది. ఎక్కువగా స్వచ్చమైన అభిమానం సినీ హీరోలపై ఉంటుంది. వాళ్ల నటనకో.. డాన్సులకో.. డైలాగులతో ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోతారు. రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్‌ ఉంటారు కానీ.. వారి అభిమాన ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే రాజకీయ నేతలు పార్టీ మారినప్పుడల్లా వారు పార్టీ మారాలి.. పార్టీ మారకపోయినా కొంత మంది మారిపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అభిమానం కృతకంగా ఉంటుంది. పార్టీలో మేలు చేసినప్పుడో.. మరో రకమైన ప్రయోజనం కల్పించినప్పుడో మాత్రమే అభిమానం చూపిస్తారు. ఇలాంటి అభిమానాన్ని తాజాగా ఏపీ మంత్రి విడదల రజనీ చూశారు. 

చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా తొలి సారి గెలిచిన విడదల రజనీ .. వెంటనే కాకపోయినా మూడేళ్ల తర్వాత మంత్రి పదవిని అలంకరించారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉండే ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఆమెకు ఇటీవల ఓ అభిమాని ఓ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి చూసుకుని ఆమె మురిసిపోయారు. ఆ బహుమతి ఏమిటంటే...  రక్తంతో గీసిన విడదల రజనీ పెయింటింగ్. నిజమే.. మీరు చదివింది నిజమే..  ఆ అభిమాని..   మంత్రి విడదల రజనీ చిత్రాన్ని రక్తంతో గీసి ఆ పెయింటింగ్ తెచ్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.  

ఆ పెయింటింగ్ చూసి.. మంత్రిగారు మురిసిపోయారు. సినిమాల్లో అయితే ఇలాంటి రక్తపు పెయింటింగ్‌ అనే ఆలోచనలు  ఎక్కువగా ప్రేమికుల మధ్య  వస్తూంటాయి. కానీ ఇక్కడ మాత్రం విడదల రజనీ అభిమాని కొత్తగా ఆలోచించారు. తన ఆరాధ్య దైవానికి వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. మామూలుగా అయితే సినీ హీరోలయినా.. ఇతరులయినా ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే ముందుగా మురిసిపోయి.. తర్వాత మురిపెంగా విసుక్కుంటారు. అలాంటి పిచ్చిపనులు చేయడం కరెక్ట్ కాదని సుద్దులు చెబుతారు. కానీ  ఏపీ మంత్రి విడదల రజనీ మాత్రం ఈ ఆ సీన్‌ను మర్చిపోయారు.  బ్లడ్ పెయింటింగ్‌లో తన పెయింటింగ్‌ను చూసి మైమరిచిపోయారు. అలా చేయడం తప్పని చెప్పలేదు.

News Reels

ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో స్వచ్చమైన అభిమానం ఉండదు. ఇక్కడ కూడా అదే. మంత్రి గారికి ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పేరు సాంబ. సోషల్ మీడియాలో విడదల రజనీ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూంటారు. ఆయన సేవలను మెచ్చిన విడదల రజనీ చిలుకసలూరిపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ కో కన్వీనర్ పదవి ఇప్పించారు. దాంతో సాంబకు అభిమానం ఉప్పొంగి.. రక్తంతో పెయింటింగ్ చేసేశారన్నమాట. అది తెచ్చి ఇచ్చారు.. మంత్రి గారు ఆనందపడ్డారు.  తన ఘనతను..  సోషల్ మీడియాలో సాంబనే పంచుకున్నాడు. 

అయితే రేపు ఎప్పుడైనా సాంబకు ఇతర పార్టీలో అంతకు మించిన పదవి వస్తే.. ఉంటారో వెళ్లిపోతారో చెప్పడం కష్టం కానీ.. అప్పుడు మంత్రి గారికి డౌట్ వచ్చి అసలు ఆ పెయింటింగ్ రక్తంతోనే చేసిందా లేదా అని టెస్టింగ్ చేస్తే.. ఏం బయటపడుతుందో చెప్పడం కష్టం. ఓ సినిమాలో  .. తన లవర్‌ని బుట్టలో పడేయడానికి కోడి రక్తంతో లెటర్ రాస్తాడో కపట ప్రేమికుడు. అలాంటిదేమైా అయి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు కూడా..! 

Published at : 19 Nov 2022 04:48 PM (IST) Tags: Vidadala Rajini Mantri Vidadala Rajini Rajini Piture with blood Rajii Fan Samba

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఏపీ నూతన సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ

Breaking News Live Telugu Updates: ఏపీ నూతన సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ

Chandrababu: చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం: ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు

Chandrababu: చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం: ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్ - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్  - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!