AP Corona Cases: ఏపీలో మళ్లీ విస్తరిస్తోన్న కరోనా వైరస్.. భారీగా కేసులు నమోదు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 3,205 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 41,954 కరోనా పరీక్షలు చేయగా.. 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా.. ఎవరూ చనిపోలేదు. తాజాగా 281 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మెుత్తం 20,63,255 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 12/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 12, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,84,984 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,360 మంది డిశ్చార్జ్ కాగా
*14,505 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y1L8zqQ8gI
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.
చాలా రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు పెరిగాయి. బంగాల్‌లో 21,098 మందికి కరోనా సోకింది. దీంతో మరోసారి రోజువారి కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. తమిళనాడులో 15,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే మరో దారుణమైన కరోనా వేవ్ చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.