Corona Cases: ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 122 మందికి కొవిడ్ పాజిటివ్ సోకింది.
ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 18,788 మంది శాంపిల్స్ పరీక్షించగా అందులో 122 మందికి కరోనా సోకింది. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 213మ మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రం ఇప్పటి వరకు మొత్తం 20,70,957 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 14,453 మంది మరణించారు. ప్రస్తుతం.. 2,030 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 06/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,957 పాజిటివ్ కేసు లకు గాను
*20,54,474 మంది డిశ్చార్జ్ కాగా
*14,453 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,030#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/a2vAFlM1Th
దేశంలో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదుకాగా 211 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 8,834 మంది కరోనా నుంచి రికవరయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 552 రోజుల కనిష్ఠానికి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 98,416 వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 34,641,561
యాక్టివ్ కేసులు: 98,416
మొత్తం కోలుకున్నవారు: 3,40,69,608
వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఆదివారం 24,55,911 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,27,93,09,669కి చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు నిర్ధరణయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి మహారాష్ట్ర వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఫిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వైరస్ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది.
Also Read: Jagan CBI : సాక్షులను ప్రభావితం చేస్తారు, జగన్‌కు హాజరు మినహాయింపు వద్దు.. హైకోర్టులో సీబీఐ వాదన !
Also Read: Polavaram : వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పోలవరం పూర్తి కాదు .. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్రం !