అన్వేషించండి

AP NGO's: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

ఉద్యోగస్తుల సమస్యలపై కనీసం చర్చించే వారు లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు.

రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్  బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగులకు సంబంధించి 71 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు సానుకూల స్పందన లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యామన్నారు. జిల్లాల వారీగా ఉద్యోగులను కలుస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు... నిన్న అనంతపురం, ఇవాళ కడప జిల్లాల్లో పర్యటించారు. కడపలో మాట్లాడిన ఆయన పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందించడంలేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారుల కూడా ఆలోచన చేయాలన్నారు. పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం తిరుపతిలో ప్రకటించారని కానీ ఉద్యోగస్తులను చర్చలకు పిలిచి అవమానించారన్నారు. 

Also Read: ఉద్యోగ నేతలకు ఏపీ ప్రభుత్వం పిలుపు - తాడోపేడో తేల్చుకుంటామంటున్న సంఘాలు !

7 డీఏలు పెండింగ్ 

11వ పీఆర్సీ అమలుపై ఎందుకు చేస్తున్నాని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగస్తులు కరోనా సమయంలో ప్రభుత్వానికి ఎంతో సహకరించామని ఆయన అన్నారు.  ప్రధాన సమస్యగా ఉన్న 11వ పీఆర్సీ అమలు చేయడం లేదని, కేవలం పీఆర్సీలోనే అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తామన్న ప్రభుత్వం 7 డీఏలు పెండింగ్ లో పెట్టిందన్నారు. అధికారంలోని రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో పెట్టారన్నారు. మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ కూడా చెల్లిండంలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంతో ఉద్యమబాట పట్టామన్నారు. 

Also Read: పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !

రేపటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన

రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సీఎం జగన్ ఉద్యోగస్తులను మాత్రం సంక్షోభంలో నెట్టేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన వివరించారు. రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. రేపటి నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు.  ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏ ఉద్యోగి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే రెండో దశలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. 

Also Read: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget