By: ABP Desam | Updated at : 11 Nov 2021 10:46 AM (IST)
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం పిలుపు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ప్రభుత్వం నుంచి పే రివిజన్ కమిషన్ నివేదిక కోసం సచివాలయంలోఆరు గంటల పాటు ఎదురు చూసినా స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. గురువారం సమావేశం అయి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి. అయితే వీరు సమావేశం కావడానికి ముందే ప్రభుత్వం వీరిని చర్చలకు ఆహ్వానించింది. ఉదయం 11 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలందరూ సచివాలయంలో భేటీకి హాజరు కావాలని సందేశం పంపించారు. జీఎడీ సర్వీసెస్ సెక్రటరీతో వీరు సమావేశం కానున్నారు.
Also Read : వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. దాదాపు అన్నీ క్లీన్ స్వీపే!
అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా పీఆర్సీ నివేదిక ఇస్తారా లేదా అన్నదానపై స్పష్టత లేదు. అయినా ప్రభుత్వమే పిలిచింది కాబట్టి సమావేశానికి వెళ్లాలని నిర్ణయించారు. ఒక వేళ ఆ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే మాత్రం వెంటనే సమావేశమే ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకంటామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు నేతృత్వంలో రెండు జేఏసీలుగా ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. ఈ రెండు జేఏసీలు కలిసి పని చేస్తున్నాయి.
Also Read: AP Employees : పీఆర్సీ నివేదిక కోసం ఆందోళన..ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతల మెరుపు ధర్నా !
వీరిద్దరూ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కొంత కాలంగా ఉద్యోగుల్లో ఉంది. ఇటీవల ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో ఉండగా బండి శ్రీనివాసరావుకు నేరుగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఏ హామీని అమలు చేయలేదు. చివరికి పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు పోరు బాట పట్టారు.
మూడు రోజుల నుంచి పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో పడిగాపులు కాయడం.. అధికారులు పట్టించుకోకపోవడం రొటీన్‌గా మారింది. దీంతో బుధవారం సచివాలంయలో రోడ్డు మీద ఆరు గంటల పాటు చూసిచూసి ఇంటికెళ్లిపోయారు. తాము రెండు చేతులతో జగన్‌ను గెలిపించామని అయినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: JC Paritala : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు ఏర్పాటు
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్ టీం ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ