Corona Cases: ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు నమోదు.. మరో ముగ్గురు మృతి
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 193 మందికి కొవిడ్ సోకగా.. వారస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 31,101 శాంపిల్స్ ని పరీక్షించారు. కొవిడ్ కారణంగా కృష్ణా, శ్రీకాకుళం మరియు విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,71,515 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం 20,55,018 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో మెుత్తం 14,460 మంది మరణించారు. ప్రస్తుతం 2,037 చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల వివరాలు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,419 కేసులు నమోదుకాగా 159 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 94,742కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది.
మొత్తం కేసులు: 34,666,241
మొత్తం మరణాలు: 4,74,111
యాక్టివ్ కేసులు: 94,742
మొత్తం కోలుకున్నవారు: 3,40,97,388
2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. మొత్తం మరణాల సంఖ్య 4,73,952కు పెరిగింది. మొత్తం రికవరీల సంఖ్య 3,40,97,388కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.
వ్యాక్సినేషన్..
బుధవారం ఒక్కరోజే 80,86,910 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 130.39 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
ఒమిక్రాన్ కేసులు..
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.
Also Read: Vijayawada Crime: బెజవాడలో చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్... వరుస దోపీడీలతో పోలీసులకు సవాల్