By: ABP Desam | Updated at : 09 Dec 2021 05:13 PM (IST)
సాయితేజ పిల్లలకు విద్యానికేతన్‌లో ఉచిత విద్య !
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటుగా ఆయన భద్రతాధికారిగా ఉన్న లాన్స్ నాయక్ సాయితేజ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన చిత్తూరు జిల్లా వాసి కావడంతో తెలుగు ప్రజలందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాయితేజ కుటుంబాన్ని ప్రముఖులు పెద్ద ఎత్తున పరామర్శిస్తున్నారు. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో స్వగ్రామం నుంచి కుటుంబాన్ని మదనపల్లికి మార్చారు సాయితేజ. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆయన పిల్లలకు ఉచిత చదువు చెప్పించేందుకు మంచు విష్ణు సిద్ధమయ్యారు.
Also Read : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...
చిత్తూరు జిల్లాకే చెందిన మంచు విష్ణు కుటుంబానికి విద్యానికేతన్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థ బాధ్యతలను ఇప్పుడు విష్ణునే చూసుకుంటున్నారు. దీంతో విష్ణు సూచన మేరకు విద్యా సంస్థకు చెందిన ప్రతినిధులు లాన్స్‌నాయక్ సాయితేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. మంచు విష్ణు సందేశాన్ని వివరించారు.
Also Read : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
సాయితేజ కొడుకు కుమార్తెల చదువు మొత్తం తమ విద్యానికేతన్ భరిస్తుందని మంచు విష్ణు కుటుంబ సభ్యులకు సందేశం పంపించారు. సాయితేజ పిల్లలకు ఇంజనీరింగ్ వరకు తమ సంస్థలోనే ఉచితంగా చదివిస్తామని చదువు విషయంలో కంగారు పడవద్దని సూచించారు. త్వరలోనే మంచు విష్ణు సాయితేజ కుటుంబసభ్యులను పరమర్శించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగానే వారి పిల్లలకు విద్యానికేతన్‌లో ఉచితంగా అందించబోయే విద్యకు సంబంధించిన పత్రాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సాయం కూడా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: Wellington Defence Staff College: 'బిపిన్ రావత్' హెలికాప్టర్ క్రాష్.. మరో 10 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సింది.. ఇంతలోనే..
ఇటీవలే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయిన మంచు విష్ణు "మా" సభ్యుల సంక్షేమం కోసం కీలక కార్యక్రమాలు చేపట్టారు. హీరోయిన్లపై వేధింపుల నివారణకు కమిటీల నియామకం.. సభ్యులఆరోగ్యం కోసం ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకున్నారు. త్వరలో మా బిల్డింగ్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు.
Also Read : హెలికాప్టర్ క్రాష్ లో బయటపడిన ఒకే ఒక్కడు.. ఎవరీ కెప్టెన్ వరుణ్ సింగ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ కేడెట్స్- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?