Saiteja Helicopter Crash : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...
తమిళనాడు హెలికాఫ్టర్ క్రాష్‌లో తెలుగు బిడ్డ సాయితేజ ప్రాణాలు కోల్పోవడం అందరిని కంట తడి పెట్టిస్తోంది. సీడీఎస్‌కే రక్షణగా ఉంటూ ఆయనతో పాటే వీరమరణం పొందాడు.
భారత్ మొత్తం కన్నీరు పెడుతోంది. తన జీవితాంతం దేశ రక్షణకే కట్టుబడిన ఓ వీరుడు అనూహ్య పద్దతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో కలిపి మొత్తం పదమూడు మంది కూడా మృత్యువు గుప్పిట్లో చిక్కుకున్నారు. అందులో తెలుగు బిడ్డ సాయితేజ కూడా ఉన్నారు. బిపిన్ రావత్ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. అందులో సాయితేజ ఒకరు.
Also Read : బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. అంచెంలచెలుగా ఎదిగారు. నేరుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కే నమ్మకమైన భద్రతాధికారిగా ఎదిగారు. ఆయన వెన్నంటి ఉండేవారు.
చురుకైన యువకుడిగా గుర్తింపు పొందిన సాయితేజ ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుండి కష్టపడేవారు. దానికి తగ్గట్లుగా ఆర్మీలో చేరారు. మంచి ప్రతిభ కనబరిచేవారు. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయమే ర్యకు ఫోన్ చేశారు సాయి తేజ. సాయి తేజ భార్య పేరు శ్యామల. కొడుకు మోక్షజ్ఞ,కూతురు దర్శిని. తల్లి ఎగువరేగడ మాజీ ఎంపీటీసీ. సాయితేజ ఆకస్మికమరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Also Read : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంలో సాయితేజ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యుల కు తెలిపింది ఆర్మీ. అత్యంత తీవ్రమైన ప్రమాదం కావడంతో కడ చూపు కూడా దక్కుతుందో లేదోనని ఆ కుటుంబసభ్యులు తల్లఢిల్లిపోతున్నారు.
Also Read : హెలికాప్టర్ క్రాష్ లో బయటపడిన ఒకే ఒక్కడు.. ఎవరీ కెప్టెన్ వరుణ్ సింగ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి