By: ABP Desam | Updated at : 08 Dec 2021 09:43 PM (IST)
Edited By: Sai Anand Madasu
కెప్టెన్ వరుణ్ సింగ్(ఫైల్ ఫొటో)
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ తోపాటు మరో 11 మంది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదంలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) గ్రూప్ కెప్టెన్, (డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ) వరుణ్ సింగ్ మాత్రమే.. ప్రాణాలతో బయటపడ్డారు.
మెుత్తం 14 మంది ప్రయాణిస్తున్న భారతీయ వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వి-5 హెలికాప్టర్ 13 మంది మృతి చెందినట్టు ఐఏఎఫ్ ధృవికరించింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. డీఎస్‌ఎస్‌సీలో డైరెక్టింగ్ స్టాఫ్, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని ఐఎఎఫ్ తెలిపింది. ఆయన గాయాలతో ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
2020 సంవత్సరంలో ఏరియల్ ఎమర్జెన్సీ తలెత్తిన సమయంలో ఎల్ సీఏ తేజస్ యుద్ధ విమానాన్ని వరుణ్ సింగ్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇందుకు గానూ.. కెప్టెన్ వరుణ్ సింగ్‌కు ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'శౌర్య చక్ర' అవార్డు లభించింది.
ఈరోజు ఉదయం బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఇతర ఆర్మీ అధికారులు.. విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు బయలుదేరారు. సుమారు 11.35 గంటలకు సూలూరు ఎయిర్ ఫోర్స్ కు చేరుకున్నారు. ఆ తర్వాత.. ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చరర్ ఇచ్చేందుకు రావత్ బృందం బయలుదేరింది. ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా.. సుమారు 12.20 గంటల సమయంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
IAF Official Statement: కూలిన సుఖోయ్, మిరాజ్ విమానాలు- ఇద్దరు పైలెట్లు సురక్షితం, ఒకరు మృతి
BBC Documentary: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై ఎందుకీ దుమారం?
జార్ఖండ్లో ఘోర అగ్నిప్రమాదం - వైద్యదంపతులు సహా ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్ , సుఖోయ్-మిరాజ్ విమానాలు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?