Top Headlines: ఏపీకి తుపాను గండం - సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్?, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. ఏపీకి తుపాను గండం
రాష్ట్రాని(Andhra Pradesh)కి మరో తుఫాను(Cyclone) గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఫెంగల్(Fengal) తుఫాను కారణంగా తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఏపీలోని తిరుపతి(Tirupati), నెల్లూరు(Nellore), అనంతపురం జిల్లాలపైనా పడింది. ఇక, తాజాగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారేందుకు చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా చదవండి.
2. మన్యం ప్రాంతాలను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల మన్యం పరిధిలో ప్రజలను పులి భయం పరుగులు తీయిస్తోంది. వారం రోజుల క్రితం ప్రత్తిపాడు మండలం ఏజెన్సీ ప్రాంతమైన బాపన్నధారలో పెద్దపులి ఆవుదూడపై దాడిచేసి చంపిన తరువాత భయం మరింత ఎక్కువైంది. దీంతో ప్రత్తిపాడు మండల పరిధిలోని సుమారు 10 గ్రామాల్లో ప్రజలకు బయటకు రావాలంటే జడుసుకుంటున్నారు. సాయంత్రానికే ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో అడుగు బయటపెట్టడం లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే అడ్డతీగల మండలం కీనపర్తిలో పొలం పనులకు వెళ్లి వస్తున్న వ్యక్తికి పులి కనిపించింది. ఇంకా చదవండి.
3. టీడీపీ అధిష్టానానికి, శ్రేణులకు పార్థసారధి, శిరీష రిక్వెస్ట్
" తెలియక జరిగిన పొరపాటు ఇది నన్ను క్షమించండి " అంటూ ఏపీ మంత్రి పార్థసారథి చంద్రబాబును వేడుకున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా అలాగే చెప్పారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీరితో పాటు కలిసిపోయి వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొనడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇలా కూటమినేతలతో కలిసినందుకు జగన్ వద్ద జోగి రమేష్‌కు చీవాట్లు పడతాయి అనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇంకా చదవండి.
4. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.?
అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లుగా కేటీఆర్‌ను ఏదో ఓ సందర్భంలో హఠాత్తుగా అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్జున్ కేసు వేరు.. కేటీఆర్ కేసు వేరు. కేటీఆర్ అరెస్టు అంశం రాజకీయంగా సున్నితమైనది. ఆయన తప్పు చేశారా లేదా అన్నది ముందుగా ప్రజల ముందు ఉంచాలి. ఆయనను అరెస్టు చేయడం కరెక్టే అని మెజార్టీ ప్రజలు అనుకునేలా చేయగలిగితే అప్పుడు అరెస్టు చేసి చట్టం ముందు పెడితే రాజకీయంగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇంకా చదవండి.
5. ఇవాళ కేటీఆర్, రేపటి టార్గెట్ కేసీఆర్‌యేనా.?
రాజకీయాల్లో కనికరం ఉండదు. రాజకీయంగా శత్రువు దొరికితే అంతే. ఇది రాజుల కాలం నుంచి వస్తున్నదే. రక్త సంబంధికుడైనా సరే సింహాసనం కోసం పోటీలోకి వస్తే కనికరం లేకుండా ఖతం చేయాల్సిందే. అప్పుడు కత్తితో నిర్మూలిస్తే.. ఇవాళ రాజకీయ పార్టీలు తమ రాజకీయ శత్రువుల కోసం చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది దేశ రాజకీయాల్లో సామాన్య విషయంగా మారింది. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి, రాజకీయంగా తమ దారికి తెచ్చుకోవడానికి, చివరకు రాజకీయ సమాధి కట్టడానికి చట్టపరంగా ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నాయి పార్టీలు. ఇంకా చదవండి.