KTR Arrest News: కేటీఆర్ అవినీతిని ప్రజల ముందు పెట్టిన తర్వాతే అరెస్టు - రేవంత్ మాస్టర్ ప్లాన్ ?
Telangana: కేటీఆర్ చేసిన తప్పేంటో ప్రజల ముందు పెట్టిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏసీబీ దర్యాప్తులో తేలిన అంశాలను ప్రజలకు తెలిపే అవకాశాలు ఉన్నాయి.
KTR will be arrested after the wrongdoing is brought before the public: అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లుగా కేటీఆర్‌ను ఏదో ఓ సందర్భంలో హఠాత్తుగా అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్జున్ కేసు వేరు.. కేటీఆర్ కేసు వేరు. కేటీఆర్ అరెస్టు అంశం రాజకీయంగా సున్నితమైనది. ఆయన తప్పు చేశారా లేదా అన్నది ముందుగా ప్రజల ముందు ఉంచాలి. ఆయనను అరెస్టు చేయడం కరెక్టే అని మెజార్టీ ప్రజలు అనుకునేలా చేయగలిగితే అప్పుడు అరెస్టు చేసి చట్టం ముందు పెడితే రాజకీయంగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసు అవినీతిలో అన్ని వివరాలు ప్రజల ముందుకు !
ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో మొత్తం రికార్డులతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సినవి ఏమీ లేవు. డబ్బులు ఎవరికి ట్రాన్స్ ఫ ర్ అయ్యారో కూడా ఆధారాలు సేకరించారు. వీటన్నింటినీ ప్రణాళికాబద్దంగా ప్రజల ముందు పెట్టి కేటీఆర్ తప్పు చేశారని ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కేబినెట్ లో చర్చించి మరీ.. ఏసీబీ కేసు విచారణకు అనుమతి ఇచ్చారు. గవర్నర్ ఇచ్చిన పర్మిషన్ సీఎస్ ద్వారా ఏసీబీకి పంపించారు.
Also Read: కేటీఆర్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది - పొంగులేటి వ్యాఖ్యలు - హింట్ ఇచ్చినట్లేనా ?
దూకుడుగా అరెస్టు చేస్తే రాజకీయంగా విమర్శలు
కేటీఆర్ లాంటి నేతను అరెస్టు చేయాలంటే దూకుడుగా ఉండకూడదు. న్యాయపరమైన అన్ని అవకాశాలను కల్పించాల్సిఉంటుంది. ఆ తర్వాత అరెస్టు చేయాలి.అప్పుడు మాత్రమే ప్రజలు కన్విన్స్అవుతారు లేకపోతే రాజకీయ కక్షసాధింపులు అనుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజకీయంగా ఆ అంశం సున్నితమైనది కావడంతో ప్రభుత్వ పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కాంపై ప్రజల్లో వీలైనంతగా చర్చ జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం ఉంది.
Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదన విరమించుకోవాలి - ఎమ్మెల్యే హరీష్ బాబు
కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాజకీయంగా ఉపయోగించుకునేలా బీఆర్ఎస్
కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న సంకేతాలు చాలా కాలంగా కనిపిస్తూండటంతో అలా జరిగితే రాజకీయంగా లాభం పొందడానికి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ గొంతు నొక్కడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజల్లోకి పార్టీని పంపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కేటీఆర్ తప్పు చేశారని.. ప్రజాధనాన్ని తరలించేశారని ప్రజలు నమ్మితే మాత్రం గడ్డు పరిస్థితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.