Top Headlines: సీఎం చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం - ఫామ్ హౌస్ కేసు దగ్గరకు ఫోన్ ట్యాపింగ్ కేసు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. సీఎం చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కావడంతో శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆదివారం నాడు వారి స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు తనయుడే టాలీవుడ్ హీరో నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే. ఇంకా చదవండి.
2. అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన
ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ? అ అంశంపై రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్ ఏపీ అప్పులు చాలా తక్కువగా ఉన్నాయని బడ్జెట్‌లో చెప్పారని కానీ టీడీపీ పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. అయితే చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో అప్పులపై ప్రకటన చేశారు. పది లక్షల కోట్లకు తగ్గ లెక్క ఆయన చెప్పారు. వీటిలో తప్పులు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలన్నారు. ఆధారాలతో సహా సమాధానమిస్తామన్నారు. జగన్‌కు ఇంత కన్నా మంచి అవకాశం ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఇంకా చదవండి.
3. ఫామ్ హౌస్ కేసు దగ్గరకు ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫార్ములా వన్ ఈ రేసు స్కాంలో కేటీఆర్‌ను విచారణ చేయడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ పర్మషన్ అడిగారు. కానీ ఇప్పటి వరకూ అనుమతి రాలేదని చెబుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతలను కేటీఆర్ సంప్రదించారని ఇటీవల ఢిల్లీ పర్యటన అందుకేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అది నిజమో కాదో కానీ కేటీఆర్ విచారణకు మాత్రం ఇంకా గవర్నర్ పర్మిషన్ రాలేదు. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కాస్త సానుకూలంగా ఉండకుండా చూసేందుకు రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు విభిన్నంగా చేస్తున్నారు. ఇంకా చదవండి.
4. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుకవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంకా చదవండి.
5. యూపీ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగం ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం రాత్రి దాదాపు 10:35 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చిన్నారుల మృతిపై జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంకా చదవండి.