అన్వేషించండి

Kisan Mitra Chhadi: ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన కిసాన్ మిత్ర ఛడీ! పాము కాటు నుంచి రక్షించే యంత్రం ఎలా పని చేసుంది?

Kisan Mitra Chhadi: భారత్‌లో ఏటా వేల సంఖ్యలో రైతులు పాము కాటుతో మరణిస్తున్నారు. దీని నుంచి రక్షించేందుకు కేంద్రం కిసాన్ మిత్ర ఛడీ పేరుతో యంత్రాన్ని ఆవిష్కరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైతుల రక్షణకు కేంద్రం కిసాన్ మిత్ర ఛడీ ప్రవేశపెట్టింది.
  • ఈ స్మార్ట్ స్టిక్ పాములు, విషపురుగులు గుర్తించి హెచ్చరిస్తుంది.
  • సెన్సార్లు, AIతో పనిచేసేది, 5-15 మీటర్ల పరిధిలో గుర్తింపు.
  • పాముకాటు మరణాలు తగ్గించి, రైతులకు భద్రత కల్పిస్తుంది.

Kisan Mitra Chhadi: భారత్‌లో వ్యవసాయ ఆధారిత దేశం. భారత్‌కు వెన్నుముకగా నిలిచే రైతులు నిరంతరం ప్రకృతితో పోరాడుతూనే ఉంటారు. అయితే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో పాము కాటు ఒకటి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా సుమారు 46వేల మంది నుంచి 60 వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇందులో అత్యధికులు పొలాల్లో రాత్రివేళ నీరు పెట్టడానికి వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే కిసాన్ మిత్ర ఛడీ

ఏంటీ కిసాన్ మిత్ర ఛడీ

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్‌సేన్‌లో నిర్వహించిన జాతీయ వ్యవసాయ మేళాలో కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివార్జ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. చూడటానికి సాధారణ చేతికర్రలా కనిపించే ఈ కిసాన్ మిత్ర ఛడీ నిజానికి ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పని చేస్తుంది. 

పొలాల్లో పాములలు లేదా ఇతర విష జంతువులు ఉన్నాయో లేదో ఈ కర్ర ముందే పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చీకటి సమయాల్లో లేదా పొలాల్లో నీరు పెట్టేట్పుడు ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది. 

కిసాన్ మిత్ర ఛడీ ఎలా పని చేస్తుంది?

ఈ స్మార్ట్ స్టిక్ పని తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక అత్యాధునిక సెన్సార్లు, సాంకేతిక దాగి ఉన్నాయి. రైతు ఈ కర్రను పట్టుకొని పొలానికి వెళ్లినప్పుడు దానిపై ఉన్న ఒక ప్రత్యేక బటన్ నొక్కి నేలకు ఆనిస్తే చాలు ఒక వేళ సమీపంలో పాము ఉంటే ఆ కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. ఈ పరికరంలో పాసివ్ ఇన్‌ఫ్రారెడ్, ఆల్ట్రాసోనిక్ సెన్సార్లు అమర్చి ఉంటాయి. పాములు విడుదల చేసే థర్మల్‌ సిగ్నేచర్స్‌, వాటి కధలికల వల్ల కలిగే సెన్సిటివ్ వైబ్రేషన్లు గుర్తిస్తాయి. 

ఈ స్టిక్ ఐదు నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. అయితే దీనిని హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరం ఆధునిక వెర్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కూడా జోడించారు. ఇది పాము కదలికలకు, గాలికి ఊగే గడ్డి కదలికలకు మధ్య తేడాను గుర్తించి, తప్పుడు హెచ్చరికలు రాకుండా చూస్తుంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?

ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 30 నుంచి 40 లక్షల పాముకాట్లు నమోదు అవుతున్నాయి. ఇందులో 60 వేల మంది వరకు చనిపోతున్నారు. ఈ మరణాలలో అత్యధికులు చెప్పులు లేకుండా లేదా తక్కువ వెలుతురులో పనిచేసే రైతులే. ఈ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు ఈ మరణాలను గణనీయంగా తగ్గించగలవు. ఈ స్టిక్ కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, గ్రామీణ భారత్‌ ప్రాణాలను కాపాడే పరికరం. శాస్త్రవేత్తల ఈ ప్రయత్నం, వ్యవసాయాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చడంలో ఒక ప్రధానమైన, అవసరమైన అడుగుగా మారనుంది. నాగుపాము లేదా కట్లపాము వంటి అత్యంత విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పరికరం ప్రత్యేకంగా ఒక వరంలా మారనుంది. సకాలంలో హెచ్చరికలు అందుకోవడం ద్వారా, రైతులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గనున్నాయి. సరైన సాంకేతికత, అవగాహనతో, మన రైతులు ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ కష్టార్జితాన్ని పండించుకోగలుగుతారు.

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

కిసాన్ మిత్ర ఛడీ అంటే ఏమిటి?

కిసాన్ మిత్ర ఛడీ అనేది పాములను గుర్తించి రైతులకు హెచ్చరికలు అందించే ఒక స్మార్ట్ స్టిక్. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారంగా పనిచేస్తుంది.

కిసాన్ మిత్ర ఛడీ ఎలా పనిచేస్తుంది?

ఈ స్మార్ట్ స్టిక్ లో అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి. నేలను ఆనిస్తే, సమీపంలో పాము ఉంటే ఇది వైబ్రేట్ అవుతుంది. ఇది పాములు విడుదల చేసే థర్మల్ సిగ్నేచర్స్, వాటి కదలికలను గుర్తిస్తుంది.

కిసాన్ మిత్ర ఛడీ ఎంత దూరం వరకు పాములను గుర్తించగలదు?

ఈ పరికరం 5 నుంచి 15 మీటర్ల పరిధిలో పాములను కచ్చితంగా గుర్తిస్తుంది. హెచ్చరిక సంకేతాలు 100 మీటర్ల దూరం వరకు పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కిసాన్ మిత్ర ఛడీ వల్ల పాముకాటు ప్రమాదాలు తగ్గుతాయా?

అవును, కిసాన్ మిత్ర ఛడీ వంటి ఆవిష్కరణలు దేశంలో ప్రతి సంవత్సరం సంభవిస్తున్న వేలాది పాముకాట్ల వల్ల కలిగే మరణాలను గణనీయంగా తగ్గించగలవు.

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget