అన్వేషించండి

Good news for Telangana farmers: తెలంగాణ రైతులకు తీపి కబురు - ఖాతాల్లో రైతుభరోసా నగదు పడేది ఎప్పుడంటే ?

Telangana farmers: తెలంగాణ రైతులకు ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా జమ చేయనున్నారు. తరవాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

Telangana farmers to receive raitu Bharosa Cash :  తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగియనుండటంతో.. మరుసటి రోజు నుండే ఈ పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.                         

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సుమారు రూ. 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సమకూర్చుకుంది. ఇందుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్  ద్వారా బహిరంగ మార్కెట్ నుండి రుణాన్ని సేకరించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నిధులను విడుదల చేసేందుకు అధికారులు తుది కసరత్తు పూర్తి చేశారు.                           

గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా అందుకున్న సుమారు 69.40 లక్షల మంది రైతులకు ఈసారి కూడా ఎకరానికి రూ. 6,000 చొప్పున సాయం అందనుంది. పారదర్శకతను పెంచేందుకు  కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే సాయం అందించేలా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు , సాగుకు పనికిరాని భూములను ఈ జాబితా నుండి తొలగించినట్లు సమాచారం.

కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు తమ పేర్ల నమోదు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. ప్రస్తుతానికి పాత జాబితా ప్రకారమే నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. నిధులు విడుదలైన మొదటి రోజు తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుండి ప్రారంభించి.. విడతల వారీగా వారం రోజుల్లో రైతులందరికీ ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఈ నిధులు అందనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                

తెలంగాణలో మండల ,  జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకోవడం.. ఫిబ్రవరి 16న మేయర్ ,చైర్మన్ల ఎన్నిక పూర్తి కానుండటంతో..  వెంటనే పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిసినందున..ఇకముగిసింది..పరిషత్ ఎన్నికలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా పంపిణీ తర్వాతే ఈ ఎన్నికల నగారా మోగించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ నెల చివరలో లేదా మార్చి మొదటి వారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Advertisement

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget