Mirchi Farmers: వరంగల్ జిల్లా మిర్చి రైతులను వేధిస్తున్న తామర పురుగు
రైతులను గండాలు వెంటాడుతున్నాయి. పంటలు చేతికి వచ్చిన వరి రైతులు కొనుగోళ్ల కోసం ఆందోళన చెందుతుండగా మిర్చి రైతులను తామర పురుగు వెంటాడుతుంది. అమెరికాలోని హవాయి, ఫ్లోరిడా నుంచి వ్యాప్తి చెందిన ఈ వ్యాధి ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి పంటను నాశనం చేస్తుంది. గత నెల రోజులుగా మిర్చి పంటపై దాడి చేస్తూ పంట ఎదుగదలను, పూతను దెబ్బతీస్తుంది. పరిస్ధితిని పరిశీలించిన శాస్త్ర వేత్తలు రైతులకు పలు సూచనలు సలహాలు అందించింనా కాని ఫలితం లేకుండా పోతుంది. పురుగు ఉదృతిని గమనిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో ఎక్కడా కూడా మిర్చి పంట చేతికి అందే దాఖలాలు కనిపించడం లేదు.నెల రోజుల నుంచి మిర్చి పంటలను ఆశించిన తామర పురుగు మిర్చి పంటలో ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలు, పండ్లను దేనినీ వదలకుండా పీల్చిపిప్పి చేసి నాశనం చేస్తుంది. మొక్క మొదళ్ల నుంచి పూత వరకు పంటపై తామర పురుగు దాడి చేయడంతో రైతులు పంటపై ఆశలు వదులుకుంటున్నారు. కళ్లముందే పంట నాశనం అవుతుండటంతో సాగుచేసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.