Tiger Attack Update in Kagaznagar | కాగజ్ నగర్‌లో అటవీ అధికారులు ఏమంటున్నారు? | ABP Desam
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాలీ క్యాంప్, విలేజ్ నెంబర్ 11 విలేజ్ నెంబర్ 4 మధ్యలో గల పత్తిచెనులో శుక్రవారం పెద్దపులి సంచరించి పత్తి ఏరుతున్న లక్ష్మీ అనే మహిళపై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడే పనిచేస్తున్న పత్తి ఏరుతున్న కూలీలు ఉలిక్కిపడి పులిని చూసి పరుగులు తీశారు. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచారం గురించి అటవీశాఖ అధికారులు అప్రమత్తమై సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. రెండు రోజులపాటు వ్యవసాయ పనులకు వెళ్లొద్దంటూ అవగాహన కల్పిస్తూ పులి సంచారం గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఇంతకీ పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు..? అక్కడ ప్రాంతంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు..? అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో సంచరించి మహిళపై దాడి చేసింది..? ఈ అంశాలపై అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి శశిధర్ బాబు,తో ఏబిపి దేశం ఫేస్ టు ఫేస్.