Kaushik Reddy warns Congress leaders | కౌశిక్ రెడ్డి బెయిల్‌పై విడుదల
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి.
రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల వద్ద 20 శాతం కమిషన్ తీసుకోవడం దోపిడీ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి సీతక్క ఇసుక కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ తీసుకోవడం దోపిడీ అని విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేదల భూములు లాక్కోవడం, అక్రమంగా క్వారీ నడపడం దోపిడీ అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ వద్ద డబ్బులు తీసుకొని పోస్టింగ్‌లు ఇవ్వడం దోపిడీ అన్నారు. సాక్షాలతో కాంగ్రెస్ పార్టీ దోపిడీని హైదారాబాద్‌లో బయట పెడతానని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటికి మరోసారి టిఆర్ఎస్ నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.





















