Karimnagar జైలుకు కూర రాజన్న తరలింపు | ABP Desam
హైదరాబాదులో సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న సిపిఐ ఎంఎల్ జనశక్తి అగ్రనేత కూర రాజన్నని సోమవారం రాత్రి సిరిసిల్ల జడ్జి ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలుకి రిమాండ్ కు తరలించారు. తన ఇంటి వద్ద నుండి బయటకు వెళ్తుండగా సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ కి తరలించారు. అయితే 2013లో కోనరావుపేట సింగిల్విండో చైర్మన్ ప్రభాకర్ రావు కాల్చి చంపిన కేసులో కూర రాజన్న కోర్టు ముందు హాజరు కాకపోవడంతోనే తిరిగి నాన్ బెయిలబుల్ వారెంట్ ద్వారా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయుధాలు కూర రాజన్న ద్వారానే నిందితులకు అందాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై బెయిల్ పై బయటకు వచ్చిన రాజన్న ప్రజాజీవనంలో ఉంటున్నప్పటికీ తిరిగి కొన్ని సంఘటనల్లో జోక్యం చేసుకున్నారని పోలీసులు భావించారు.





















