Hydra demolitions in Patny Center | నాలా ఆక్రమణలను తొలిగించే పనిలో హైడ్రా అధికారులు | ABP Desam
అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఎవరి మాట వినకుండా ముందుకు దూసుకుపోతున్నారు. వర్ష కాలం కావడంతో నాలా ఆక్రమణలను తొలిగించే పనిలో పడ్డారు హైడ్రా అధికారులు.
Patny సెంటర్ లో నాలాపై నిర్మించిన వాణిజ్య కట్టడాలను హైడ్రా అధికారులు తొలిగించారు. Patny నాల ఆక్రమణకు గురి అవ్వడంతో patny కాంపౌండ్, patny కాలనీ, విమాన నగర్, BHEL colony, ఇందిరమ్మ నగర్ నీట మునుగుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
GHMC, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో కలసి పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలా ఆక్రమణలతో వేలాది నివాసాలు నీట మునిగిన పాత చిత్రాలను సెల్ఫోన్లలో చూపించారు స్థానికులు. దాంతో వెంటనే ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా. నాలా ఆక్రమణలు తొలిగించడంతో 5 కాలనీల వాసులు స్థానికులు ఆనందం వ్యక్తం చేసారు. వర్ష కాలం వల్ల తన నివాసాలు ఎక్కడ నీట మునుగుతాయో అని ఆందోళన పడ్డ స్థానికులు.. హైడ్రా చర్యలతో అధికారులకు ధన్యవాదాలు చెప్పారు.





















