ED Case on Celebrity Betting Apps Promotion | టాలీవుడ్ సెలబ్రిటీలపై ED కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా 29 మంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్, యూ ట్యూబర్స్, కంపెనీల పై ఈడీ కేసు ఫైల్ చేసింది.
రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ళ, లక్ష్మీ మంచుతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటుల్లో విష్ణు ప్రియ భీమనేని, రీతూ చౌదరి, శ్రీముఖి, వర్షిని సౌందరరాజన్, సిరి హనుమంతు, సురేఖ వాణి కుమార్తె బండారు సుప్రీతా నాయుడు, 'బిగ్ బాస్' ఫేమ్ టేస్టీ తేజ, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయనీ పావని, నేహా పఠాన్, హర్ష సాయి తదితరులపై పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది.
బీఎన్ఎస్‌లోని 318 (4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4 సెక్షన్లు, ఐటీ యాక్ట్ 2000,2008 లోని 66డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ... పారితోషకం తీసుకుంటున్నారని పలువురు కేసులు నమోదు చేసారు. ఇలా యాప్స్ ని ప్రమోట్ చేయడంవల్ల ఎంతోమంది డబ్బులు పెట్టి మోసపోయి ... ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.





















