Car Accident in Shambhipur | శంభీపూర్ లో కారు బీభత్సం | ABP Desam
హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని శంభీపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో కారు డివైడర్ ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి ఇలా ఇంటి పిట్టగోడపై నిలబడింది. చూడటానికి చిత్రవిచిత్రమైన పార్కింగ్ లా కనిపిస్తున్నా నిజంగా ఘోర ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి గోడపైన కారు ఆగటంతో షాక్ కి గురైన ఆ ఇంటిలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ క్రేన్ సాయంతో కారును జాగ్రత్తగా కిందకు దింపారు. పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా ఈ యాక్సిడెంట్ జరిగిన విధానం వైరల్ గా మారింది.





















