Cable Operators vs TGSPDCL | 2 రోజులుగా నో ఇంటర్నెట్.. నష్టానికి బాధ్యులెవరు? | ABP Desam
మొత్తం హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా.. కరెంట్ పోల్స్ దగ్గర cut చేసి పడేసిన కేబుల్ వైర్లు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా ఇవే విజువల్స్. దీనివల్ల దాదాపు 2 రోజుల నుంచి చాలా ఏరియాల్లో ఇంటర్నెట్ సర్వీసులు కంప్లీట్‌గా నిలిచిపోయాయి. సడెన్‌గా వైఫై కనెక్షన్ కట్ అయిపోవడంతో ఎంతోమంది రిమోట్ వర్కర్లతో పాటు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కంప్లీట్‌గా వర్క్ ఆపెయాల్సి వచ్చింది. దీనివల్ల లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. అవుతున్నారు. కేబుల్ వైర్లలో కరెంట్ పాస్ కావడం వల్లే ఐదుగురు చనిపోయారని కేసు రిజిస్టర్ కావడంతో ఇదంతా స్టార్ట్ అయింది. ఈ కేసు తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సడెన్ ఆర్డర్స్‌తో హైదరాబాద్ సర్కిల్లో అన్ని చోట్ల కరెంట్ పోల్స్‌కి ఉన్న కేబుల్ వైర్లని తెంచి పారేస్తోంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్. దీంతో కేబుల్ ఆపరేటర్లంతా టీజీఎస్‌పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడమే కాకుండా.. ఇదిలాగే కంటిన్యూ అయితే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా సర్వీస్‌లే ఆపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ డెసిషన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్లేమంటున్నారంటే.. ఫస్ట్ నుంచి సమస్యని లైట్ తీసుకుని.. ఓ ఇన్సిడెంట్ జరగగానే హడావిడి చేసి.. ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవడంతో హైదరాబాద్ లాంటి సిటీలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటున్నారు. బట్.. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈ కేబుల్ వైర్లు తీసేయాలనే డెసిషన్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నది కాదు. దాదాపు 1 మంత్ నుంచి కేబుల్ ఆపరేటర్లకి, గవర్నమెంట్‌కి మధ్య దీనిపై మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మొదటి మీటింగ్ 2024, జూలై 27న జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్ట్ 7న రెండో మీటింగ్ జరిగింది. ఎలక్ట్రిక్ పోల్స్‌కి పెట్టిన కేబుల్ వైర్లన్నీ వారం రోజుల్లో తీసేయాలని.. లేదంటే గవర్నమెంట్ ఇనీషియేషన్ తీసుకుని మొత్తం వైర్లు తీసేస్తామని ఆగస్ట్ 7 మీటింగ్‌లో కేబుల్ ఆపరేటర్లకి గవర్నమెంట్ చాలా సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చింది. బట్.. కేబుల్ ఆపర్లు మాత్రం ఏడాది గడుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇక రీసెంట్‌గా ఇదే కేబుల్ వైర్లు తగిలి ఐదుగురు చనియారనే ఆరోపణలతో గవర్నమెంట్ సీరియస్ అయి.. వెంటనే కేబుల్స్ తొలగించడం స్టార్ట్ చేసింది. దీనికి రిటాలియేషన్‌గా సీవోఏఐ.. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డెప్యూటీ జెనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టాబ్లిఫ్ అయిపోయిన సిస్టమ్‌ని జస్ట్ వారం రోజుల్లో మార్చడం అసాధ్యం. కొంచెం టైం పడుతుంది. అలా కాదని.. ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటే.. దీనివల్ల వందల కోట్ల నష్టం జరుగుతుంది. కంపెనీలు నష్టపోతాయి. ఎకానమీ దెబ్బ తింటుంది. కాబట్టి ఆలోచించండి’ అని అంటున్నారు. బట్ గవర్నమెంట్ మాత్రం.. సింపుల్‌గా ‘నో’ అని చెప్పి మొత్తం వైర్లు కట్ చేయించేస్తోంది. బట్.. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే.. కేబుల్ వైర్లు కట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వైర్లు కట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన గవర్నమెంట్ బానే ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్స్‌ని గాలికొదిలేసి ఎలక్ట్రిక్ పోల్స్ నుంచి కేబుల్ వైర్లు తొలగించని కేబుల్ ఆపరేటర్లు బాగానే ఉన్నారు. మహా అయితే ఫైనాన్షియల్‌గా కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. కానీ ఇన్స్యూరెన్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ.. ఈ ఇంటర్నెట్ మీద ఆధారపడి బతికే రిమోట్ వర్కర్లు, కంపెనీల పరిస్థితేంటి? వేలకి వేలు పే చేసి ఇంటర్నెట్ ప్యాకేజీలు కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఉన్నట్లుండి నెట్ ఆగిపోవడంతో.. సడెన్‌గా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫైనాన్షియల్‌గా భారీ నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తోంది. మరి వీళ్ల సమస్యకి కారణం ఎవరు? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదెలా? దీనికి ఆన్సర్ ఆపరేటర్లు, గవర్నమెంటే చెప్పాలి.





















