Adilabad 54Feet Ganesh Idol Immersion | ఆదిలాబాద్ లో ఈ వినాయకుడి నిమజ్జనం చూసి తీరాల్సిందే | ABP
Discription: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేష్ మండల్ ఆధ్వర్యంలో 54 అడుగుల భారీ గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. గత 54 ఏళ్లుగా ఇక్కడ నూతి మీద గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి 11 రోజులపాటు పూజలు నిర్వహించి 11నాడు సాయంత్రంపూట ఈ గణేష్ విగ్రహం ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఇంతకి ఈ 54 అడుగుల భారీ గణేష్ విగ్రహన్నీ ఎప్పుటి నుండి ఏర్పాటు చేస్తున్నారు..? ఇక్కడ నూతి మీదనే గణేష్ విగ్రహం ప్రతిష్టించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి..? గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించిన చోట నిమజ్జనం చేయడం ఎలా సాధ్యం..? ఈ గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి ఎక్కడేక్కడి భక్తులు వస్తుంటారు..? తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గణపతిగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలోని కుమార్ జనతా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 54 అడుగుల గణేష్ పై abp దేశం ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేష్ మండల్ కమిటీ నిర్వాహకులు గత 54 ఏళ్లుగా ఓ నూతిమీద గణపతిని ప్రతిష్టించి 11 రోజుల పాటు పూజలు నిర్వహించి 11 రోజున సాయంత్రం పూట ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఈ ఏడాదితో 54ఏళ్లు పూర్తి కావడంతో 54 అడుగుల గణపతినీ నిర్మించారు. 11 రోజుల పాటు ఈ మహా గణపతికి పూజలు నిర్వహించి దర్శించుకొని భక్తులు మొక్కుకున్నారు. ఈ కుమార్ జనతా గణేష్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. నూతిమీద ప్రతిష్టించిన చోటే మోటార్ పైప్ ద్వారా నీటిని విడుదల చేసి ఉన్న చోటే నిమజ్జనం చేస్తారు.




















