Adilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో భారీ వినాయకుడిని ప్రతిష్టించారు. కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వాహకులు తోట పరమేశ్వర్ అధ్వర్యంలో గత 54 ఏళ్లుగా వారి పూర్వీకుల నుండి ఓ నూతి మీద యధావిధిగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగిస్తువస్తున్నారు. గత 20ఏళ్లుగా వినూత్న రీతిలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ తర్వాత అంతటి ప్రత్యేకత ఆదిలాబాద్ లోని నూతి మీద గణపతికి ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ పేట్ కాలనీలో ఓ బావి ఉంది. ఆదిలాబాద్ ప్రజలు గతంలో ఆ బావి నీరు తాగేవారు. కొన్ని కారణాలతో ఆ బావి మూతపడింది. ఈ కాలనీకి చెందిన తోట పరమేశ్వర్ 1971లో జనతా గణేష్ మండల్ నూ స్థాపించారు. ఇక్కడ ఏటా మట్టి వినాయక విగ్రహాలను ఆ బావి మీద ప్రతిష్ఠించేవారు. అలా దీనికి నూతి మీద గణపతి అని పేరు వచ్చింది. గత 20 ఏళ్లుగా భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ యేడాది 52 అడుగుల ఎత్తు భారీ వినాయకుడి ప్రతిమను సగం మట్టి, సగం పీవోపీతో, జనప నారా కలిపి తయారు చేశారు. సుమారుగా 40 రోజుల సమయం పట్టింది. ఏటా ఒక్కో అడుగు పెంచుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేక పూజల నడుమ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తు వేడుకలను జరుపుకుంటామని, ఇక నిమజ్జనం రోజున ఇక్కడే ఉన్న బావికి అమర్చిన మోటారు సహాయంతో భారీ విగ్రహంపై నీరు చల్లి నిమజ్జనం చేస్తామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న చోటే మహా గణపతి విగ్రహం బావిపైన నిమజ్జనం అవుతుందని కుమార్ జనతా గణేష్ మండల్ అధ్యక్షుడు తోట పరమేశ్వర్ abp దేశం తో విరించారు.