Team India Asia Cup 2025 | ఫైనల్ బెర్త్ కోసం ఇండియా పోరాటం !
ఆసియా కప్ 2025 లో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ముందుకు దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు అందరు ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించింది. ఈ 4 టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.
సూపర్-4లో ప్రతి టీమ్ మిగిలిన మూడు టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ సూపర్-4 లో ఎక్కువ పాయింట్స్ సాధించిన టాప్-2 టీమ్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అంటే, టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడాలి. ఫైనల్‌కు చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి. రెండు మ్యాచులు గెలిస్తే నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా భారత్ మూడు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తుంది. అలా చేస్తే డైరెక్ట్ గా ఫైనల్‌కు అర్హత సాధించవచ్చు.
ఇండియా ముందు ఇప్పుడున్న పెద్ద సవాల్ శ్రీలంకను ఎదుర్కోవడం. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో మన ప్లేయర్స్ ఊహించిన స్థాయిలో రాణించలేక పొయ్యారు. బౌలర్లు విఫలమయ్యారు. దాంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. గ్రూప్ దశలో శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. ఇండియాకు గట్టి పోటీ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి వచ్చే మ్యాచులో ఇండియా ఎలాంటి మార్పులు చేస్తుందో... ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.





















