Rohit Sharma Records | India vs Australia | వణికిస్తున్న రోహిత్ శర్మ రికార్డ్స్
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడబోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ చాలా కాలం తర్వాత గ్రౌండ్ లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అంటేనే చాలా రసవత్తరంగా, పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ తో రోహిత్ వరల్డ్ కప్ ఆడతాడా లేదా అన్నది తెలిసిపోతుంది అని కూడా మరికొంతమంది అనుకుంటున్నారు.
ఇక రికార్డ్స్ చూసుకుంటే.. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై 30 వన్డేల్లో, ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ 1328 పరుగులు చేశాడు. అంతేకాకుండా తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ .. 171 పరుగులు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనే సాధించాడు. సో రోహిత్ రికార్డ్స్ చూసిన ఫ్యాన్స్.... ఈ సిరీస్ లో హిట్ మ్యాన్ షో ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నారు.





















