RCB Management about Releasing Siraj | సిరాజ్ రిటెన్షన్ పై స్పందించిన RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో స్టార్ బౌలర్ సిరాజ్ కు ఎంతో మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంది. సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్ ను కూడా RCB నుంచి మొదలు పెట్టారు. అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కూడా సిరాజ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. 2018 నుంచి సిరాజ్ RCB లోనే ఉన్నాడు. కానీ ఐపీఎల్ 2025 లో మాత్రం RCB మేనేజ్మెంట్ సిరాజ్ ను రెటైన్ చేసుకోలేదు. దాంతో మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో RCB తీరుపై ఫ్యాన్స్ బాగా ఆగ్రహం వ్యక్తం చేసారు. కానీ RCB నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇప్పుడు ఈ విషయంపై RCB స్పందించింది. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మాట్లాడుతూ... సిరాజ్‌ను టీంలో ఉంచుకోవాలా? రిలీజ్ చేయాలా ? లేదా ... రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా? అనే విషయంలో ఎంతో ఆలోచించాం. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని సిరాజ్‌తో కూడా చర్చించాం. ఎలాగైనా భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోవాలని అనుకున్నాం. ఇది జరగాలంటే సిరాజ్‌ను కొనసాగించడం కుదరదని అర్థమైంది.అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అనుకున్నట్లుగానే బౌలింగ్ యూనిట్ బలంగా మార్చుకుంది. మెగా వేలంలో హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ను దక్కించుకుంది. ఆర్సీబీ టైటిల్ సాధించడంలో బౌలర్లు కీలకపాత్ర పోషించారు.





















