Neeraj Chopra's New Record in Javelin Throw | నీరజ్ చోప్రా కొత్త రికార్డ్
నీరజ్ చోప్రా @90 ఆసియాలో 3వ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు
భారత జావలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కొత్త రికార్డును సృష్టించాడు. దోహాలో జరుగుతున్న డైమండ్ లీగ్ లో 90.23 మీటర్లు త్రో చేసాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్లు విసరడంతో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. అయితే వెబర్ ఈ త్రోను ఆరో ప్రయత్నంలో చేశాడు. కానీ నీరజ్ మాత్రం మూడవ ప్రయత్నంలోనే 90.23 మీటర్లు త్రో చేసాడు. జావెలిన్ త్రోలో 90 మీటర్లు విసిరిన ప్లేయర్స్ లో 25వ స్థానంలో ఉన్నారు నీరజ్ చోప్రా. అయితే ఆసియా నుండి 90 మీటర్ల పైన త్రో చేసిన అథ్లెట్లలో నీరజ్ మూడవ స్థానాల్లో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌తో పాటు తైవాన్‌కు చెందిన చెంగ్ చావో సన్ ఈ ఘనతను సాధించాడు. ఆసియా నుండి వచ్చిన అథ్లెట్లలో భారత్ తరపున నీరజ్ చోప్రా పేరు కూడా చేరింది.





















