MS Dhoni Post For Radhika Merchant | అమ్మాయి తరపు బంధువుగా Ambani పెళ్లిలో ధోనీ | ABP Desam
మహేంద్ర సింగ్ ధోని ఫోన్ వాడేదే చాలా తక్కువ. ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి ఓ ఫోటో పెడతాడు అది కూడా మూడ్ ఉంటేనే. అలాంటి ధోని అంబానీల పెళ్లి గురించి ఓ పోస్ట్ పెట్టాడు. ఇదిగో అదే ఈ పోస్ట్. ఆ ఏముంది అందరూ అంబానీ పెళ్లికి వెళ్లాం ఇంత గొప్పగా చేశారు అంత గొప్పగా చేశారు అని పెడుతున్నారుగా ఇది కూడా అలాంటిదే అనుకుంటే కాదు. అసలు ఈ పోస్ట్ ధోని పెట్టింది అంబానీల గురించి కాదు. అమ్మాయి తరపు వాళ్ల కోసం. ఎస్ పెళ్లి కూతురు రాధికా మర్చంట్ కోసం ధోని ఈ పోస్ట్ పెట్టారు. రాధికా మర్చంట్ ను ఆత్మీయంగా ధోని హగ్ చేసుకున్న ఫోటోను పెట్టి..ఇలా రాశారు. రాధికా స్వచ్ఛమైన వెలుగులు జిమ్మే నీ నవ్వును ఎప్పుడూ చెరిగిపోనివ్వకు..అనంత్ దయచేసి ఎప్పట్లానే ఉత్సాహంగా ఉండు.నువ్వు నీ చుట్టూ ఉండే మనుషులందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటావో.రాధికాను కూడా అంతే బాగా చూసుకో. మీ వైవాహిక జీవితం సంతోషంగా, బోలెడన్ని నవ్వులతో, అడ్వంచరస్ గా సాగిపోవాలి. మిమ్మల్ని మళ్లీ త్వరలోనే కలుస్తా అంటూ పోస్ట్ చేశారు ధోని. పైగా ఆ పోస్టుకు రాజీ సినిమాలోని దిల్ బరా సాంగ్ ను యాడ్ చేసి..వీరేన్ అంకుల్ ఈ పాట మీకోసం అంటూ ఫన్ క్రియేట్ చేశాడు మాహీ. వీరేన్ అంటే వీరేన్ మర్చంట్ రాధికా మర్చంట్ వాళ్ల తండ్రి. సో అదన్న మాట బాలీవుడ్ సైన్యం అంతా అనంత్ బ్రిగేడియర్ అంటూ హడావిడి చేస్తే ధోని పెళ్లికి వచ్చింది అమ్మాయి తరపు బంధువుగా అన్నమాట.