KL Rahul Century India vs West Indies | కేఎల్ రాహుల్ సెంచరీల మోత
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 12 ఫోర్లతో వెస్ట్ ఇండీస్ పై సెంచరీ నమోదు చేసాడు. అతని కెరీర్‌లో ఇది 11వ టెస్ట్ సెంచరీ. అయితే 9 ఏళ్ల తర్వాత రాహుల్ సొంతగడ్డపై సెంచరీ చేయడం విశేషం.
కేఎల్ రాహుల్ తన టెస్ట్ కెరీర్‌ను 2014లో ప్రారంభించాడు. అప్పటి నుండి 11 ఏళ్లలో 11 సెంచరీలు చేసాడు. టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్‌పై రాహుల్ కు ఇది రెండో సెంచరీ. దీనికన్నా ముందు 2016లో కింగ్‌స్టన్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తోలి టెస్ట్ లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా ఈ సంవత్సరం రాహుల్ సాధించి రెండా సెంచరీ ఇది.
అలాగే ఈ సంవత్సరంలో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అయితే తన బ్యాటింగ్ తో వెస్ట్ ఇండీస్ బౌలర్లను రాహుల్ బాగానే ఇబ్బంది పెట్టాడు. తన క్లాస్ ఇన్నింగ్స్ తో ఇండియా భారీ స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.





















