Surya Kumar Yadav Orange Cap Chances | IPL 2025 లో సాయి సుదర్శన్ ను దాటాలంటే SKY కే ఛాన్స్ | ABP Desam
ఈ ఐపీఎల్ లో బ్యాట్ తోనే మాట్లాడింది అంటే సాయి సుదర్శన్ మాత్రమే. 15 మ్యాచ్ లు ఆడి 6 హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో కలిపి 759 పరుగులు చేశాడు. 156 స్ట్రైక్ రేట్ తో పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ సీజన్ లో ఇక గుజరాత్ ప్రయాణం ముగిసిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై మీద ఓడిపోవటంతో గుజరాత్ ఎలిమినేట్ అయిపోయింది. సో సాయి సుదర్శన్ ఇక 759 పరుగులతోనే సీజన్ ను ముగించాల్సి వచ్చింది. కానీ సాయి దగ్గర్నుంచి ఆరెంజ్ క్యాప్ లాక్కోవటానికి మిగిలిన వాళ్లకు అంతే స్థాయిలో ఛాన్స్ కూడా లేదు. టాప్ 10 పరుగుల వీరుల జాబితాలో స్కై, విరాట్ కొహ్లీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ మాత్రమే ఇంకా లీగ్ లో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ సాయి సుదర్శన్ ని చేరుకోవాలంటే ఇంకా 86పరుగులు చేయాలి. ఈ రోజు ముంబై క్వాలిఫైయర్ 2 గెలిస్తే...వాళ్లకు ఫైనల్ కూడా ఉంటుంది కాబట్టి రెండు మ్యాచుల్లో ఈ స్కోరును అందుకోవచ్చు. ఒక్క సూర్య కుమార్ మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. విరాట్ కొహ్లీ ప్రస్తుతం టేబుల్ లో 614పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. 145పరుగుల వెనుకంజలో ఉన్నాడు. ఆర్సీబీ కి ఒక్క ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి కింగ్ విరాట్ కొహ్లీ ఆరెంజ్ క్యాప్ సాధించాలంటే ఫైనల్ మ్యాచ్ లో 145 పరుగులు చేయాలి. ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఈరోజు క్వాలిఫైయర్ 2 గెలిచి ముంబై ఫైనల్ కి కూడా ఈ రెండు మ్యాచుల్లో సూర్య కుమార్ యాదవ్ ఆడితేనే ఆరెంజ్ క్యాప్ సాధించటం సాధ్యం లేదంటే ఈ సీజన్ కి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ సొంతం అవుతుంది.





















