PBKS vs MI Qualifier 2 Preview | ఐపీఎల్ ఫైనల్ ఆడాలంటే నేడే తుది అవకాశం | ABP Desam
రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన టోర్నీ. ఎన్నో విజయాలు మరెన్నో పరాజయాలు. అన్నింటినీ దాటుకొచ్చేశాయి కొన్ని టీమ్స్. ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాయి. ఆర్సీబీ ఫైనల్ కి వెళ్లిపోయిన ఈ టోర్నీలో ఫైనల్ లో నిలబడాలంటే పంజాబ్, ముంబై జట్లకు ఇంకొక్క అవకాశం మాత్రమే మిగిలి ఉంది. అదే ఈ రోజు జరిగే క్వాలిఫైయర్ 2 లో గెలవాల్సిందే గెలిచి తీరాల్సిందే. ఈ ఐపీఎల్ లో టేబుల్ టాపర్ గా లీగ్ స్టేజ్ నుంచి ముగించి పంజాబ్ పొగరు చూపిస్తే..ఆడిన ఆఖరి 10 మ్యాచుల్లో 8 గెలిచి ఈ రోజు క్వాలిఫైయర్ 2 లో నిలబడింది ముంబై ఇండియన్స్. ఐదు కప్పులు గెలిచిన అనుభవం ముంబై సొంతం. ఆర్సీబీ మీద అనూహ్యంగా ఓడిపోయిన పంజాబ్ కాస్త ఒత్తిడిలో ఉంటే...గుజరాత్ లాంటి బలమైన జట్టును ఇంటికి పంపిన ముంబై ది కాస్త పై చేయి అనే చెప్పుకోవాలి. రెండు జట్లు ఈ రోజు హోరాహోరీగా తలపడటం అయితే ఖాయం. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారటం ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆఖరి 14 మ్యాచుల్లో 9 మ్యాచుల్లో 200లకు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. ఆడిన ఆఖరి 7 మ్యాచుల్లో 6సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. సో టాస్ గెలిచిన టీమ్ కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఉన్నాయి. 2022 తర్వాత ఆడిన ఐదు మ్యాచుల్లో పంజాబ్ 3 గెలిస్తే ముంబై రెండే గెలిచింది. ఆ రకంగా కాస్త వెనుకంజలో ఉన్న ముంబై పంజాబ్ కు ఫైనల్ వెళ్లే ఛాన్స్ ఇస్తుందా లేదా తొక్కి పారేసి ఆర్సీబీ తో ఆఖరి ఫైట్ కి సై అంటుందా ఈ రోజు రాత్రికి తేలిపోనుంది.





















