PBKS vs DC Match Preview IPL 2025 | టాప్ 2 లో నిలవాలంటే పంజాబ్ ఢిల్లీని ఓడించాల్సిందే
ఈ ఐపీఎల్ సీజన్ లో టాప్ 2 రేస్ ఫుల్ ఎగ్జైంటింగ్ గా ఉంది. టాప్ 2 లో ఉండే ఆ అడిషనల్ అడ్వాంటేజ్ కోసం ఆర్సీబీ, పంజాబ్ పోటాపోటీగా ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో ఇప్పటికే రెండు జట్లకు సమానమైన పాయింట్లు ఉన్నా నిన్న హైదరాబాద్ కొట్టిన దెబ్బకు ఆర్సీబీకి నెట్ రన్ రేట్ తగ్గిపోయి రెండో స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో ఉన్న పంజాబ్ చటుక్కున రెండోస్థానానికి ఎగబాకింది. పంజాబ్ SRH కి థాంక్స్ చెప్పుకోవాలి. కానీ పంజాబ్ ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి ఢిల్లీని ఓడించటం, నెక్ట్స్ ముంబైని ఓడించటం ఈ రెండూ సక్సెస్ ఫుల్ గా చేయగలిగితే మిగిలిన జట్ల అవకాశాలతో సంబంధం లేకుండా టాప్ 1 జట్టుగా 21 పాయింట్లతో లీగ్ దశను ముగించే అవకాశం ప్రస్తుతం పంజాబ్ జట్టు ఒక్క దానికే ఉంది. మరే టీమ్ కు ఈ ఛాన్స్ లేదు. కానీ పంజాబ్ గెలవటం కావాలి. ఢిల్లీ జట్టును తక్కువ అంచనా వేయలేం. సెకండాఫ్ వాళ్ల అదృష్టం బాగోక ఓడిపోయారు కాబట్టి ఎలిమినేట్ అయ్యారు కానీ ఈ సీజన్ లో ఫస్టాఫ్ అంతా ఢిల్లీదే కనీసం ఆ టీమ్ ను ఓడించ లేకపోయింది ఏ జట్టూ. మ మొదటి ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలతో ఛాంపియన్ జట్టులా కాలర్ ఎగరేసింది ఢిల్లీ. ప్రత్యేకించి కేఎల్ రాహుల్ ఈ సీజన్ లో ఢిల్లీకి కొండంత అండగా నిలిచాడు. అక్షర్ రాకుంటే మళ్లీ ఫాఫ్ డుప్లెసీ కెప్టెన్సీ చేయనున్నాడు ఢిల్లీకి. విప్రాజ్ నిగమ్ ఫిట్నెస్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో తను ఆడకపోతే ఇప్పటికే అక్షర్ లేక విప్రాజ్ ఆడక ఆల్ రౌండర్లను కోల్పోతుంది ఢిల్లీ. పంజాబ్ కు మాత్రం మార్కస్ స్టాయినిస్, జోష్ ఇంగ్లీష్ తిరిగొచ్చారు. స్క్వాడ్ తో జాయిన్ ఇది ప్లస్ పాయింట్ వాళ్లకు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, అయ్యర్ మరో సారి బ్యాటింగ్ లో చెలరేగాలని పంజాబ్ తప్పక కోరుకుంటుంది. చూడాలి మరి జైపూర్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ లో పంజాబ్ గెలిచి టాప్ 2 ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంటుందా లేదా ఆర్సీబీ సన్ రైజర్స్ చేతిలో చోక్ అయినట్లు ఢిల్లీ చేతిలో పంజాబ్ దెబ్బలు తింటుందా.





















