PBKS IPL 2025 Playoffs | కోల్ కతా కప్ కొట్టింది అనుకున్నారు కాదు అయ్యర్ ఆడించిన ఆట అది
పదేళ్ల తర్వాత లాస్ట్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కప్ కొట్టింది. అందరూ ఇది గంభీర్ ఖాతాలో తోసేశారు. మెంటార్ కాబట్టి అప్పుడు తనే ఏదో కప్ గెలిపించినంత సంబరాలు చేశారు. తమకు కప్ తెచ్చి పెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను గౌరవించకపోగా..ఆక్షన్ ముందు కనీసం రిటైన్ చేసుకోకుండా వదిలిపెట్టేశారు. పోన్లే మంచి పనే అయ్యింది. తన విలువ తెలియని చోటు నుంచి బయటకు వచ్చిన అయ్యర్ ను విలువ తెలిసిన పంజాబ్ ఏకంగా 25కోట్లు పెట్టి కొనుక్కుంది పంజాబ్. కట్ చేస్తే ప్రీతి జింతా నమ్మకాన్ని నిలబెట్టేలా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ను ప్లే ఆఫ్స్ కి పట్టుకెళ్లాడు. 11ఏళ్ల తర్వాత తొలిసారిగా పంజాబ్ ఆడనున్న ప్లే ఆఫ్స్ ఇది. నిజంగా ఆ టీమ్ కి ఇప్పుడు ఈ టైమ్ లో కావాల్సిన రిలీఫ్ ఇది. ప్రభ్ సిమ్రన్ లాంటి దూకుడును..ప్రియాంశ్ ఆర్య లాంటి యంగ్ బ్లడ్ ను సరైన ట్రాక్ లో నడిపిస్తూ...వధీరా, శశాంక్ సింగ్ లాంటి డైనమైట్స్ కావల్సినప్పుడల్లా దింపుతూ...చాహల్, అర్ష్ దీప్ ల ఎక్స్ పీరియన్స్ ను ఫుల్ గా వాడుకుంటూ అయ్యర్ బాబు ఈ సీజన్ లో ఆడించిన ఆటతోనే ఇది సాధ్యమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకే ఒక్కసారి ఐపీఎల్ ఫైనల్ ఆడింది. అప్పుడు కూడా ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరే. దీన్ని బట్టి అర్థం కావట్లేదా. కెప్టెన్ గా చాప కింద నీరులా తను ఎంతెలా పనులు చక్కబెడుతున్నాడో. అర్థం కానట్లు ఎవరికీ పట్టన్నట్లు అండర్ రేటెడ్ కెప్టెన్ గా మిగిలిపోయాడు కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మ్యాజిక్ తెలియాలంటే ఈ సీజన్ లో పంజాబ్ మ్యాచ్ లు చూడాల్సిందే. పనిలో పనిగా ఓ బ్యాటర్ గానూ ఇరగదీస్తున్నాడు అయ్యర్. నిన్న రాజస్థాన్ మీద 30 పరుగులు చేయటంతో పాటు ఈ సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలతో 435పరుగులు చేశాడు. 458పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ తర్వాతే అయ్యరే పంజాబ్ తరపున టాప్ స్కోరర్. అలా బ్యాటర్ గానూ ఇటు కెప్టెన్ సాబ్ గానూ పంజాబ్ కు ప్లే ఆఫ్స్ మోక్షం పదకొండేళ్ల తర్వాత కలిగించాడు శ్రేయస్ అయ్యర్.





















