MS Dhoni Retirement | RCB vs CSk Highlights | ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడా..? ఫ్యాన్స్ ఇది విన్నారా
MS Dhoni Retirement | RCB vs CSk Highlights | రేపో, మాపో ధోని రిటైర్మెంట ప్రకటిస్తాడని నీకు చెవిలో ఏమైనా చెప్పాడా..! ఇంకా ఏ ప్రకటన రాకముందే నువ్వు ఇది ఎలా చెప్తావని మీకు డౌట్ రావచ్చు. కానీ, ధోని ఊహతీత చర్యలు దగ్గర నుంచి చూసినవాడు ఎవడైనా సరే...ఆర్సీబీ వెర్సస్ సిఎస్కే మ్యాచ్ తరువాతే ఇలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే... మ్యాక్సిమమ్ ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అనే ప్రచారం నడుస్తోంది. అందుకే రుత్ రాజ్ గెక్వాడ్ కు కెప్టెన్సీ ఇచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతుంది. ఒకవేళ ఫైనల్ కు చెన్నై వెళ్తే.. అదే గడ్డపై ధోని లాస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే అంచనాలూ ఉన్నాయి. ధోని గురించి తెలిసిందేగా..రిటైర్మెంట్ ప్లాన్ అనుకున్నా ప్రతిసారి సరైనా మ్యాచ్ దొరకదు. నిన్న కూడా అదే జరిగింది ఫైనల్ కాదు కదా ప్లే ఆఫ్స్ కు కూడా చెన్నై అర్హత సాధించలేకపోయింది. దీంతో..ఈ ఐపీఎల్ ముగిశాక ఓ మంచి రోజు చూసుకుని సైలెంట్ గా ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ ధోని ఇలాగే చేశాడు. 2014లో ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నప్పుడే.. ఎవరు ఊహించని టైం లో టెస్టుల నుంటి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక..2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై రన్ అవుట్ ఐన తరువాత ధోని ఇంకో మ్యాచ్ ఆడలేదు. మేబీ రెస్ట్ లో ఉన్నాడేమో అనుకున్నారు. కానీ, చూస్తే 2020 ఆగస్టు 15 అంతా జెండా పండుగ చేసుకుంటుంటే ధోని మాత్రం సడన్ గా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ కు రిటైర్మెంట్ అని ప్రకటించేశాడు. ఇలా... ధోని తిక్క అంతా వేరే..! స్టేడియంలోనే రిటైర్ అవ్వాలని... సొంత ఫ్యాన్స్ మధ్య చివరి మ్యాచ్ ఆడాలేనే లెక్కలేవి పెట్టుకోడు. తిక్క దొబ్బిందా... సరదా సరదాకు బైక్ రిపేర్ చేసుకుంటూ కూడా రిటైర్మెంట్ ని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టగల సమర్థుడు. సో.. ఇలా ధోని గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా సరే... may be ధోని లాస్ట్ మ్యాచ్ ఐపోయింది. వచ్చే సీజన్ స్టార్ట్ అయ్యే లోపలే కచ్చితంగా ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని బలంగా నమ్ముతున్నారు. కానీ, తలా ఫ్యాన్స్ మాత్రం ఇది నిజం కాకుంటే బాగుండు అని ఇప్పటి నుంచే దేవుడికి మొక్కుకుంటున్నారు.





















