MI vs DC Match Highlights IPL 2025 | పదకొండోసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముంబై ఇండియన్స్
ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేయటంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మిగిలిన నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ను కైవసం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో ముంబై ముందు తలొగ్గటంతో MI తిరుగేలేకుండా ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని మంచి పని చేశాననే ఫీల్ అయ్యింది చాలా సేపు. రీజన్ ముంబై టాప్ ఆర్డర్ అనుకున్నంతగా రాణించలేదు. ఢిల్లీ బౌలర్లు పరుగులు రానివ్వకుండా ముంబై స్కోరును అంతకంతకు తొక్కి పట్టారు. ఓ దశలో 17వ ఓవర్ ఆడుతున్నా పాండ్యా అవుటయ్యే టైమ్ కి ముంబై స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే. మహా అయితే ముంబై 150 కొడితే ఎక్కువ అనుకుంటున్న సూర్య కుమార్ యాదవ్ దుమ్ము దులిపేశాడు. లాస్ట్ రెండు ఓవర్లలో నమన్ ధీర్ తో కలిసి పెను విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా సూర్య 43బాల్స్ లో 7ఫోర్లు 4 సిక్సర్లతో 73పరుగులు చేస్తే నమన్ ధీర్ 8 బాల్స్ లోనే 2ఫోర్లు 2 సిక్సర్లతో 24పరుగులు అందించటంతో ముంబై 181పరుగుల టార్గెట్ ను ఢిల్లీ ముందు పెట్టగలిగింది. అక్షర్ పటేల్ లేకపోవటంతో డుప్లెసి కెప్టెన్సీ చేసిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కి ఉన్న బ్యాటింగ్ లైనప్ కి ఆ స్కోరు ఛేజబులే అనుకుంటే...ముంబై బౌలింగ్ తో అదరగొట్టింది. రాహుల్, డుప్లెసి, అభిషేక్ పోరల్ ను పవర్ ప్లేలోనే అవుట్ చేయటంతో ఇక ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. రిజ్వి 39పరుగులతో కాస్త పోరాడిన అది ఏ మాత్రం సరిపోలేదు. శాంటర్న్, బుమ్రా మూడేసి వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించటంతో డీసీ అనూహ్యంగా 121 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి తో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకుంది. ముంబై 11వసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడే అవకాశాన్ని సాధించి సత్తా చాటింది.





















