Josh Inglis vs Jasprit Bumrah Qualifier 2 IPL 2025 | ఇదేం మాస్ ప్లానింగ్ రా అయ్యా
మీకు విశాల్ పందెంకోడి సినిమా గుర్తుంటే..అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ఏంటిరా మనోళ్ల మీద చేయి చేసుకున్నారు అంటున్నారు అన్న ఊళ్లో లేడా ఏంటీ అంటాడు ఓ విలన్. అటేపోడు చెబుతాడు..చేయి చేసుకున్నదే అన్న మీద అయ్యా అంటాడు. అంతే అటేపోడు షాక్ అయిపోతాడు. ఎవ్వడిని చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారో వాణ్నే టార్గెట్ చేసి కొడితే. నిన్న పంజాబ్ అదే ప్లాన్ తో వచ్చింది. జనరల్ గా బుమ్రా లాంటి బౌలర్ ని వీలైనంత డిఫెండ్ చేసుకుని మహా అయితే స్ట్రైక్ రొటేట్ ఓవర్ లో ఓ ఫోర్ వస్తే మహా ప్రసాదం అనుకోవాలి ఇదేగా ఇన్నాళ్లుగా వస్తున్న సంప్రదాయం. అలాంటిది పంజాబ్ బ్యాటర్లు ఏకంగా బుమ్రానే టార్గెట్ చేయించారు. ఆ బాధ్యతను జోస్ ఇంగ్లిస్ కి అప్పగించారు. ముంబై బౌలింగ్ శిబిరానికి మైండ్ పోయేలా బుమ్రానే టార్గెట్ చేసి ఆడేశాడు ఇంగ్లిస్. రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో బుమ్రా వేసిన మొదటి ఓవర్ నుంచే 20 పరుగులు రాబట్టాడు ఇంగ్లిస్. జోస్ ఇంగ్లిస్ కొట్టింది తక్కువే కావొచ్చు. 21 బాల్స్ లో 38 పరుగులకే అయిపో ఉండొచ్చు. కానీ మోరల్ గా బుమ్రాను ఎంత దెబ్బ కొట్టాడో బుమ్రా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయాడు..ఏకంగా 4 ఓవర్లలో 40పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా చాలా రేర్ గా ఇలా ఫెయిల్ అవుతాడు. 200 ప్లస్ టార్గెట్ చేజ్ చేసే క్రమంలో వాళ్ల ప్రధాన బౌలర్ మానసిక స్థైర్యాన్ని పంజాబ్ చేసిన ఈ సర్జికల్ స్ట్రైకే మ్యాచ్ లో పంజాబ్ విజయానికి కారణమైంది. మిగిలిన బౌలర్ల పనిని అయ్యర్ చూసుకున్నాడు. బౌల్ట్, అశ్వని కుమార్ బౌలింగ్ లో సిక్సర్ల మోత మోగించాడు. మ్యాచ్ తర్వాత అయ్యర్ చెప్పాడు. మేం ఏం ప్లాన్స్ అనుకున్నామో వాటిని వంద శాతం నిజాయితీతో పూర్తి చేశాం కాబట్టే ఈ మ్యాచ్ ను గెలిచాం అనీ. మాములు స్ట్రాటజీ కాదు ఇది.



















