GT vs MI Eliminator Match Preview IPL 2025 | నేడే ముంబై, గుజరాత్ ల మధ్య నాకౌట్ పోరు | ABP Desam
నిన్న జరిగిన క్వాలిఫైయర్ 1 కి ఓ ప్రత్యేకత ఉంది. పంజాబ్, ఆర్సీబీ రెండు జట్లు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు.కానీ ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ ఇంకో రకం. గుజరాత్ ఓ సారి కప్పు కొడితే...ముంబై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు కప్పులు కొట్టిన జట్టు. అలాంటిది రెండు మాజీ ఛాంపియన్ల మధ్య ఈరోజు ఎలిమినేటర్ పోరు జరగనుంది. ఛండీఘర్ ముల్లాన్ పూర్ లోనే జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 లో పంజాబ్ తో తలపడాల్సి ఉంటుంది. రెండు జట్ల బలాబలాలను చూసుకుంటే రెండు జట్లకు విదేశీ కీలక ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోవటం వీళ్లకు ఈ నాకౌట్ మ్యాచ్ ముందు పెద్ద దెబ్బ. గుజరాత్ టైటాన్స్ కు వెన్నెముక లా మారి తన జట్టుకు అవసమరైనప్పుడుల్లా ఆదుకుంటున్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మరో వైపు ముంబైకి రెండు షాకులు. ఒకటి తమ ఓపెనర్ ర్యాన్ రికెల్టెన్, రెండో అతను విల్ జాక్స్. వీళ్లిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్ కోసం వెళ్లిపోయారు. గుజరాత్ బట్లర్ ప్లేస్ లో కుశాల్ మెండిస్ ను, ముంబై ర్యాన్ రికెల్టెన్ ప్లేస్ లో బెయిర్ స్టో, విల్ జాక్స్ ప్లేస్ లో రిచర్డ్ గ్లీసన్ ను, చరిత్ అసలంకను స్క్వాడ్ లోకి తీసుకుంది. సో గుజరాత్ కి సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ ఆడటం ఎంత కీలకమో...ముంబైకి రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ఆడటం అంత కీలకం. బౌలింగ్ డిపార్ట్మెంట్స్ తో ఎలాంటి ఇబ్బంది లేదు. ముంబైకి బౌల్ట్, బుమ్రా కొండంత అండ కాగా గుజరాత్ ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ బౌలింగ్ తో సుఖంగా ఉంది. మంబైకి శాంట్నర్ ఉంటే గుజరాత్ కి రషీద్ ఖాన్ ఉన్నాడు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకూ 14సార్లు ఐపీఎల్ లో 13సార్లు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న జట్లే అంటే క్వాలిఫైయర్ 1 ఆడిన జట్లలో ఒకటే ఐపీఎల్ కప్పును ఎగరేసుకుపోయింది. ఒక్కసారి మాత్రమే 3వస్థానంలో జట్టు కప్ కొట్టింది. అది కూడా 2016లో సన్ రైజర్స్. ఎలిమినేటర్ లో గెలిచి క్వాలిఫైయర్ 2లో గెలిచి చివరికి ఫైనల్ ఆడి ఆర్సీబీ మీద కప్ కొట్టింది. కానీ నాలుగో స్థానంలో ఉన్న జట్టు ఒక్కసారి కూడా ఇప్పటివరకూ ఐపీఎల్ చరిత్రలో కప్పు కొట్టిందే లేదు. మరి ఈ సారి టాప్ 2 జట్లు అంటే పంజాబ్, ఆర్సీబీలు అయితే ఆర్సీబీ ఆల్రెడీ నిన్న క్వాలిఫైయర్ 1 గెలిచి ఫైనల్ కి వెళ్లిపోయింది. మూడు నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబైలు ఇవాళ తలపడనున్నాయి. మరి గుజరాత్ గెలిచి ఒక్కసారి మాత్రమే సన్ రైజర్స్ చేసి చూపించిన ఘనతను రిపీట్ చేస్తుందా..నాలుగో స్థానంలో ఉన్న ముంబై గెలిచి క్వాలిఫైయర్ 2 తర్వాత ఫైనల్ గెలిచి నాలుగో స్థానంలో ఉండి ఐపీఎల్ కప్పు కొట్టిన టీమ్ గా సరికొత్త చరిత్రను సృష్టిస్తుందా ఆసక్తికరంగా ఉండనుంది ఈ ఈరోజు మ్యాచ్.





















