CSK vs PBKS Match Highlights IPL 2025 | చెన్నై ను ఐపీఎల్ నుంచి సాగనంపిన పంజాబ్ కింగ్స్ | ABP Desam
ఈ సీజన్ లో ఘోరమైన ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను వాళ్ల సొంతగడ్డలోనే ఓడిస్తే ప్లే ఆఫ్స్ ఆశలను బీభత్సంగా మెరుగుపరుచుకోవచ్చన్న టైమ్ లో పంజాబ్ కు లడ్డూలా దొరికింది చెన్నై సూపర్ కింగ్స్. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక సతమతమైన చెన్నైని 4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించిన ఈ ఐపీఎల్ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. కడైకుట్టి సింగం షో
టాస్ గెలిచి చెన్నై ని బ్యాటింగ్ కి ఆహ్వానించిన పంజాబ్..అనుకున్నట్లుగానే పవన్ ప్లేలోనే మోత మోగించింది. పంజాబ్ బౌలర్లు అర్ష్ దీప్, మార్కోజాన్సన్, బ్రార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో పవర్ ప్లేలో ముగిసేలోపే 3వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. చిన్న కుర్రాళ్లు రషీద్, ఆయుష్ మాత్రే, జడేజా క్రీజులో కుదురుకోలేక అవుట్ అయిపోయారు. అయితే చెన్నైను ఆ తర్వాత నిలబెట్టాడు కడైకుట్టి సింగంగా సీఎస్కే ఫ్యాన్స్ పిలుచుకునే శామ్ కర్రన్. మంచి బంతులను ఓపికగా ఆడుతూ..చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ చాన్నాళ్ల తర్వాత తనలోని బీస్ట్ కు పని చెప్పాడు కర్రన్. మొత్తంగా 47 బాల్స్ లో 9ఫోర్లు 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి శామ్ క్రన్...తనున్నంత సేపు పది రన్ రేట్ ఉండేలా మెయిన్ టైన్ చేశాడు.
2. డెవాల్డ్ బ్రూయిస్ సపోర్ట్
శామ్ కర్రన్ ఆడుతున్నా మరో ఎండ్ లో సహకరించేందుకు మాత్రమే పరిమితమయ్యాడు డెవాల్డ్ బ్రూయిస్...అడపా దడపా బౌండరీలు బాదుతూ 26 బాల్స్ లో 2 ఫోర్లు ఓ సిక్సర్ తో 32పరుగులు చేశాడు బ్రూయిస్. అయితే బ్రూయిస్ అజ్మతుల్లా క్లీన్ బౌల్డ్ అవటం..ఆ తర్వాత వెంటనే శామ్ కర్రన్ కూడా అయిపోవటంతో చెన్నై పతనం మొదలైంది. ధోనీ ఆడిన నాలుగు బాల్స్ లో ఫోర్, సిక్స్ తో టచ్ లో కనిపించినా భారీ షాట్ కి వెళ్లి అయిపోయాడు.
3. చాహల్ హ్యాట్రిక్ సంచలనం
శామ్ కర్రన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు 200 ఈజీగా దాటేసేలా కనిపించిన చెన్నైను గల్లంతు చేసి పారేశాడు యజువేంద్ర చాహల్. తనెందుకు ఐపీఎల్ లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ నో ప్రూవ్ చేస్తూ...ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి పెను ప్రకంపనలు రేపాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్ లో రెండో బంతికి ధోని అవుటైతే..నాలుగు ఐధు ఆరు బంతులకు వరుసగా దీపక్ హుడా, అన్షుల్ కాంభోజ్, నూర్ అహ్మద్ లు అవుటవ్వటంతో చాహల్ కు హ్యాట్రిక్ లభించింది. మొత్తంగా 3 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసిన చాహల్ చెన్నైని 190పరుగులకే పరిమితం చేశాడు.
4. ప్రభ్ సిమ్రన్ దూకుడు
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ దూకుడైన ఆరంభాన్ని ఇచ్చారు. ఓవర్ కి పది పరుగులు పైన పెడుతూ 44 పరుగులు జట్టుస్కోరు వద్ద ప్రియాంశ్ ఆర్య అవుటైనా తర్వాత కెప్టెన్ అయ్యర్ తో కలిసి పంజాబ్ స్కోర్ బోర్డును ప్రభ్ సిమ్రన్ పరుగులు పెట్టించాడు. మొత్తంగా 36 బాల్స్ లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 54 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ సీజన్లో మూడో హాఫ్ సెంచరీ సాధించి అవుటయ్యాడు.
5. కెప్టెన్ అయ్యర్ రూలు
ప్రభ్ సిమ్రన్ అయిపోయాన అయ్యర్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఆడాడు. 41 బాల్స్ లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 72పరుగులు చేసిన అయ్యర్..సీజన్ లో తన ఫామ్ ను కొనసాగిస్తూ 4వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే అయ్యర్ ను పతిరానా క్లీన్ బౌల్డ్ చేయటంతో మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకూ డ్రాగాన్ అయ్యింది. చివర్లో పతిరానా కాస్త చెన్నైకి ఆశలు కల్పించినా మార్కో యాన్సన్ ఫోర్ కొట్టి పంజాబ్ కు ఆఖరి ఓవర్ లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా నిలవగా...చెన్నైని చెపాక్ లో ఓడించిన పంజాబ్...ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి దూసుకెళ్లింది.





















